Vaisaakhi – Pakka Infotainment

స్టవ్ లు అవసరం లేకుండానే లడ్డూ తయారీ..

తిరుమల లడ్డూ ప్రసాదం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త నిర్ణయం తీసుకుంది. లడ్డూల తయారీ కోసం డిసెంబరు నాటికి రూ.50కోట్లతో ఆత్యాధునిక యంత్రాల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ యంత్రాలు వాడుకలోకి వస్తే స్టవ్‌ల అవసరం లేకుండా లడ్డూ తయారీకి ముఖ్యమైన బూందీ తయారుచేయవచ్చని టీటీడీ వర్గాలు చెప్తున్నాయి.. ఈ అధునాతన యంత్రాల ద్వారా రోజుకు 6లక్షల వరకు లడ్డూలు తయారుచేసే అవకాశం ఉంటుందన్నారు. స్విట్జర్లాండ్, జర్మనీ, ఆస్ట్రేలియా నుంచి తెప్పిస్తున్నట్లు చెప్పారు. అవసరమైన అన్ని పదార్ధాలు వేస్తే ఆ యంత్రమే లడ్డూ తయారీ చేస్తుందని చెప్తున్నారు. ఏ రోజుకారోజు అంతకంతకూ పెరుగుతున్న భక్తులను దృష్టి లో పెట్టుకుని తగినస్థాయిలో లడ్డూలు సిద్దం చేయటానికి ఈ యంత్రాలు ఎంత గానో సహకరిస్తాయని క్వాలిటీ విషయంలో ఏ మాత్రం తేడా ఉండదని దేవస్థానం అధికారులు చెప్పుకొచ్చారు. రద్దీ రోజుల్లో తిరుమలకు వచ్చే భక్తులకు లడ్డూ ప్రసాదం అందుబాటులోకి తెచ్చేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. . 307 ఏళ్లు చరిత్ర ఉన్న శ్రీవారి లడ్డూ ప్రసాదం కు ఉన్న ప్రాధాన్యత చెప్పలేనిది లడ్డూ ప్రసాదాన్ని కోట్లాది మంది భక్తులు భక్తితో స్వీకరిస్తారు. పేటెంట్ హక్కు ని పొందిన తిరుమల లడ్డూ రుచి మరెక్కడా లభించదు. తిరుమల లడ్డూ అన్ని రకాలుగా ప్రత్యేకమైనదే. శతాబ్దాల కాలంగా రుచితో ఎక్కడా రాజీ పడకుండా ఈ లడ్డూ తయారీ పట్ల ఇటీవల తీవ్ర విమర్శలు చుట్టు ముడుతున్న నేపద్యంలో లడ్డూ ప్రసాదాల పట్ల మరింత విశ్వాసాన్ని పెంచే అంశం లో టీటీపీ తమ వంతు ప్రయత్నాలు మొదలుపెట్టింది.. ఇదిలా ఉండగా చాలాకాలం నుంచి చర్చల్లో ఉన్న తిరుమల శ్రీవారి ఆనందనిలయం బంగారు తాపడం పనులను ఆరు నెలల పాటు వాయిదా వేస్తున్నామని టీటీడీ తెలిపింది. త్వరలో మరో తేదీ నిర్ణయించి తెలియ జేస్తామని ఈవో తెలియజేసారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విమానగోపురం బంగారు తాపడం పనులను స్థానిక కాంట్రాక్టరు నిర్దేశిత వ్యవధిలో పూర్తి చేయకపోవడంతో ఆలస్యం అవుతోందన్నారు.తిరుమలలో కాంట్రాక్టర్ల వల్ల ఆలశ్యమయ్యే పరిస్థితి తలెత్తకుండా నిర్దేశిత వ్యవధిలో ఆనంద నిలయం బంగారు తాపడం పనులు పూర్తి చేసేందుకు వీలుగా గ్లోబల్‌ టెండర్లకు వెళుతున్నామని చెప్పారు. ఈ ప్రక్రియకు సమయం పడుతుండడంతో తాపడం పనులను వాయిదా వేశామన్నారు.. భక్తులకు అసౌకర్యం కలగకుండా శ్రీవారి ఆలయంలో తాపడం పనులు పూర్తి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More