ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ మ్యాగజైన్ ప్రచురించిన ది మోస్ట్ సిక్స్ ఫ్యూచరిస్టిక్ సిటీస్ ( the most six futuristic citys) జాబితాలో ఆంధ్రుల కలల రాజధాని అమరావతి ని గూర్చి ప్రచురించింది. ఈ విషయాన్ని తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి పోస్ట్ చేసారు. న్యూయార్క్ కేంద్రంగా 1920 నుంచి ప్రచురింప బడుతున్న ఆర్కిటెక్చర్ డైజెస్ట్ మేగజైన్ లో భవిష్యత్ నగరాల జాబితాలో అమరావతి గురించి ప్రస్తావించడం.. రాబోయే తరానికి ఈ నగరం ఆధునిక, స్థిరమైన నగరంగా మారడానికి ఎంతగానో ఉపయుక్తంగా మారుతుందని ప్రపంచ వేదికపై భారతదేశానికి ఇదో గర్వకారణనగరం గా ఆవిర్భవిస్తుందని ఆయన ప్రస్తావించారు. ఇటలీ, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, మెక్సికో, లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్, దేశాలలో పాటు భారతదేశం నుంచి ప్రచురితమవుతున్న ఈ అంతర్జాతీయ ఇంటీరియర్ డిజైన్స్, ఆర్కిటెక్చర్ మేగజైన్ (architectural digest.com) ఎప్పటికప్పుడు సరికొత్తగా రూపుదిద్దుకుంటూన్న గమ్యాలకు మారుతున్న లక్ష్యాలకు కొత్త స్థాయి ని తీసుకువెళ్లే పూర్తిగా పునర్నిర్మించబడిన మెట్రోపాలిటన్ ప్రాంతాలు సరికొత్తగా ఆవిర్భవిస్తున్నట్లు వెల్లడించింది. ఆర్కిటెక్ట్‌లు, అర్బన్ ప్లానర్ లు భవిష్యత్తు రూపకల్పన కోసం అత్యద్భుతమైన , అత్యంత ప్రాథమిక అవసరంగా నిలిచే తేలియాడే నగరాల నుండి బాహ్య అంతరిక్షం వరకు కొత్త ఆవిష్కరణలు చేస్తున్నట్టు చెప్పింది. దానికి సంబంధించి ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ రేపటి నగరాల కోసం అత్యంత ఆసక్తికరమైన ఆరు టాప్ సిటీస్ ని ప్రకటించింది. అందులో భారతదేశం నుంచి అమరావతి స్థానం దక్కించుకోవడం విశేషం. ఈ ఆరు నగరాలలో కొన్ని నిర్మాణంలో ఉండగా మరికొన్ని ప్రతిపాదన దశ లో ఉన్నట్టు వెల్లడించింది.. స్మార్ట్ ఫారెస్ట్ సిటీ (మెక్సికో), టెలోసా(అమెరికా), ది లైన్(సౌదీ అరేబియా), ఓషనిక్స్ బూసాన్(సౌత్ కొరియా),చెంగ్డు స్కై వాలీ( చైనా), తో పాటు అమరావతి( ఇండియా) ఇందులో చోటు దక్కించుకున్నాయి. ఇప్పటికిప్పుడే ఈ మాస్టర్‌ప్లాన్ అమలు కానప్పటికీ, భవిష్యత్ నగరం ఎలా ఉంటుందనే దాని గురించి గొప్ప అంతర్దృష్టిని అమరావతి ప్రతిభింభిస్తుందని పేర్కొంది. ప్రణాళిక పరంగా ప్రభుత్వ సముదాయం ఈ నగరనిర్మాణం లో పాలుపంచుకుంటుందని లుటియన్స్ (ఢిల్లీ ) సెంట్రల్ పార్క్ (న్యూయార్క్) ప్రేరణ పొందిన ఒక పెద్ద సెంట్రల్ గ్రీన్ స్పేస్ ప్రాంతం అమరావతి మధ్యలో విస్తరించి ఉంటుందని ఇది పర్యావరణహిత నగరం గా రూపొందుతుందని అరవై శాతం పచ్చదనం తో నీటితో నిర్మితం అవుతుందని అందులో ప్రస్తావించింది.. ఫోస్టర్ పార్ట్‌నర్స్ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత స్థిరమైన వాటిలో అమరావతి ఒకటిగా ఉండే అవకాశం ఉందన్న ఆశాభావం వ్యక్తం చేసింది. రాజధాని అంశంపై వివాదం చెలరేగడం.. మూడు రాజధానులు తెరపైకి రావడం, అమరావతి భవిష్యత్ ఏంటి అన్న సమయంలో ఒక అంతర్జాతీయ పత్రిక అమరావతి ని భవిష్యత్ నగరం పేర్కొనడం గొప్ప విషయం అని రాజకీయ నిపుణులు చెప్తున్నారు.. ఆంధ్రప్రదేశ్ కు అమరావతి రాజధాని గా ఉండేందుకు అన్ని అర్హతలు ఉన్నాయని ఇదే రేపటి భవిత నగరమని వారు పేర్కొన్నారు.
previous post
next post