మన దేశం ఎన్నో ఊహించని సంఘటనలకు నెలవుగా మారుతుంది. అది ఏ విషయమైనా సరే జనాలకు దగ్గరకు వెళ్లి వైరల్ గా మారుతుంది. దానిపై పెద్ద చర్చ కూడా నడుస్తుంది. ఇప్పుడు అలాంటి అరుదైన సంఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. అత్యున్నత పదవి స్వీకరించి బాధ్యతలు చేపట్టిన రోజునే పదవి విరమణ చేస్తుండటం ఒక విశేషమే.. తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నందిమేడారంకు చెందిన పొనుగోటి నవీన్ రావును నియమిస్తూ కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. శుక్రవారం ఉదయం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పోనుగొటి నవీన్ రావు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే పదవీకాలం ముగియడంతో శుక్రవారం సాయంత్రమే పదవి వి రమణ కూడా చేయనున్నారు. న్యాయ చరిత్రలో ఆరుదైన రికార్డుగా ఈ ఘటనను చెబుతున్నారు. ధర్మారం మండలం నంది మేడారంకు చెందిన నవీ న్ రావ్ సుదీర్ఘకాలం న్యాయమూర్తిగా పనిచేశారు. న్యాయవ్యవస్థలో తొలిసారిగా తెలుగులో పూర్తిస్థాయి తీర్పును వెలువరించి రికార్డు సృష్టించారు. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానానికి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే పదవి విరమణ చేయడం విశేషం. ఇప్పుడు న్యాయ శాఖలో కూడా ఇదే విషయంపై చర్చించుకుంటున్నారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో చాలా అరుదుగా జరిగే ఇటువంటి ఘటనలు ఎప్పుడో గాని ఎవరూ చూసి ఉండరు. అది కూడా ఒక అత్యున్నత పదవికి ప్రమాణ స్వీకారం చేయడం అదే రోజు పదవీ విరమణ చేయడం విశేషమే మరి. ఇప్పుడు ఈ విషయం కోసమే అంతటా చర్చ జరుగుతుంది. చాలామంది సోషల్ మీడియా వేదికగా ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు.
previous post
next post