తెలంగాణలో ముందస్తు ఎన్నికల నగార మ్రోగనుంది. అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ కంటే ముందుగానే జరిగే అవకాశం స్పష్టం గా కనిపిస్తోంది. అధికార టీఆరెస్ జాతీయ రాజకీయాలకు వెళ్లి భారత రాష్ట్ర సమితి (బీఆర్ ఎస్)గా రూపాంతరం చెందిన అనంతరం పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించాలన్న ప్రణాళికతో ముందడుగు వేస్తున్నారు. దేశ రాజకీయాలు మలుపు తిప్పే విధంగా దాదాపు నాలుగు లక్షల మందితో ఖమ్మంలో ఈనెల18వ తేదీన నిర్వహించే సభ కెసిఆర్ స్టామినా ఏంటో దేశాన్ని తెలిపే విధంగా ఉంటుందని పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సంవత్సరంలోనే షెడ్యూల్ ప్రకారం తెలంగాణతో పాటు మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, కర్ణాటక, చత్తిస్ఘడ్, మధ్యప్రదేశ్, మిజోరాం, రాజస్థాన్, ఎన్నికలు జరగనున్నాయి అయితే డిసెంబర్లో ప్రస్తుత అసెంబ్లీ కాల పరిమితి ముగియనుండగా మిగిలిన రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ తో పాటే తెలంగాణ ప్రభుత్వం కూడా ఎన్నికలకు వెళ్ళనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు చేసిన నేపథ్యంలో సెక్రటేరియట్ ప్రారంభించిన అనంతరం ఎన్నికలు వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కెసిఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 17న తన కలల సౌధం ని ప్రారంభించిన అనంతరం అసెంబ్లీ రద్దుకు ముఖ్యమంత్రి సిఫార్సు చేసే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు మొదటిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం అప్పటి సచివాలయంలో వాస్తు దోషాలు ఉన్నాయన కారణంతో అత్యావసరం అయితే తప్ప సచివాలయానికి హాజరు కాని ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనంత ప్రగతి భవన్ నుంచో ఫామ్ హౌస్ నుంచో కొనసాగించారు పెరేడ్ గ్రౌండ్స్ లో కొత్త సచివాలయాన్ని నిర్మించాలని ప్రతిపాదించి పావులు కదిపినప్పటికీ మళ్లీ పాత సచివాలయం ప్లేస్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా 650 కోట్ల రూపాయలు వ్యయం తో కొత్త సెక్రటెరియట్ భవనాన్ని నిర్మించారు. దాదాపుగా నిర్మాణ పనులు పూర్తి కావడం తో దీన్ని ప్రారంభించిన అనంతరం ఎన్నికలకు వెళ్లాలని సీఎం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో శాసనసభ్యునిగా పోటీ చేసి తర్వాత వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా కూడా పోటీ చేసే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారని విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది. దేశ రాజకీయాలను శాసించాలంటే పార్లమెంట్ సభ్యునిగా కూడా పోటీ చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా సచివాలయం ప్రారంభం తర్వాత తెలంగాణలో ఎన్నికల వాతావరణం నెలకొనబోతోందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ కొనసాగుతోంది.
previous post
next post