ఆంధ్రప్రదేశ్ లో 175 అసెంబ్లీ 25 పార్లమెంట్ స్థానాలకు తెలంగాణలో 17 లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరిగితే మునుపెన్నడూ లేనంత గా ఓటర్లు ఉత్సాహంగా ఓటేశారు.. అయితే హైదరాబాద్ లో మాత్రం కేవలం 46.08 శాతం మాత్రమే ఓటింగ్ నమోదైంది.. హైదరాబాదీలు మాత్రం మొద్దు నిద్ర వీడలేదు ఓటు వేయడానికి ఉత్సాహం చూపించలేదు ఇలా ఎన్నో విమర్శలు వచ్చాయి.. ఐటీ కారిడార్లలో అయితే మరీ అన్యాయం గా ఓట్ల శాతం పడిపోయింది. కొత్త ఓటర్లు అధిక సంఖ్యలో నమోదయినప్పటికి వారి ఓటు కూడా పడకపోయే సరికి ఐపీఎల్ పైన పెట్టిన శ్రద్ధ లో కనీసం కూడా ఓటెయ్యడం లో పెట్టలేదని గట్టిగానే మాట్లాడారు.. నిజానికి హైదరాబాదీలు పోలింగ్ విషయంలో ప్రతీ సారి ఇలాంటి ఆరోపణలే ఎదుర్కొంటున్నారు మొన్నటికి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే ఆరోపణ. ఓటు వేసేందుకు నగరవాసులు ముందుకు రావడం లేదని.. రాజధాని ప్రజలకు ఎందుకింత బద్ధకం అని.. ఎన్నికలు జరగినప్పుడల్లా అందరూ ఇదే మాట.. పొద్దు పొద్దున్నే అటు చిరంజీవి, నాగార్జున, నుంచి నాని నితిన్ వరకు అందరూ ఓటేసి సిరా అంటుకున్న వేలు చూపించారు.. ఇటు అధికారులు, రాజకీయ నాయకుల, ఇతర సెలబ్రిటీలు కూడా ఓటు హక్కు వినియోగించుకోవడమే కాకుండా.. మీరు కూడా ఓటెయ్యండి మొత్తుకుంటూనే ఉన్నారు. అయినా కూడా నగరవాసి నిమ్మకు నీరెత్తిన్నట్టే వున్నాడు… ఎన్నికలు జరిగినప్పుడల్లా ఇదే తంతు. ఏంటీ అన్ని సోషల్ మీడియా లలో అందరూ వేలిపై ఉన్న సిరా చుక్కని చూపిస్తూ మేం ఓటేశామోచ్ అని ఫోటో లు పెడుతున్నారే మరి తేడా ఎక్కడొచ్చింది.. అంటే అక్కడే హైదరాబాద్‌లో దాదాపు నలభై లక్షల మంది ఆంధ్రోళ్లే వున్నారు.. ఐటీ సెక్టార్ లో సగానికిపైగా ఉంటే వివిధ వ్యాపారాల్లో ఇతర ఉద్యోగాలు,బిజినెస్ లలో మిగిలిన వాళ్లు సెటిలయిపోయారు.. లాంగ్ వీకెండ్ వచ్చిందంటే చాలు.. వూళ్లకు చెక్కేయడమే.. అలాగే లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ కి అలాగేవెళ్లిపోయారు.. ఇక్కడడొక ట్విస్ట్ ఎమంటే వీళ్ళలో చాలామందికి ఇక్కడ అక్కడ రెండు రాష్ట్రాల్లో కూడా ఓటు హక్కు ఉంది. దీంతో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటంతో.. చాలామంది ఓటు కోసం ఏపీకి క్యూ కట్టారు. వాళ్లంతా ఏపీ ఓటింగ్ లో పాల్గొని అక్కడి పర్శన్టేజ్ ని అమాంతం పెంచేశారు.. వీళ్ళలో ఓ పదిహేను శాతం అయిన ఇక్కడ ఓటేస్తే హైదరాబాద్ గౌరవం గా అరవై శాతం పైబడి సాధించేది.. ప్రతిదానికి ఆధార్ లింక్ ఉండాలని భావించే సంస్థలు, ప్రభుత్వాలు ఓటు కి ఆధార్ లింక్ ని ఎందుకు కావాలి అనుకోవడం లేదో ఆ పెరుమాళ్లకే తెలియాలి. ఓటు కు ఆధార్ లింక్ అయితే ఇలా రెండు చోట్ల ఓట్ల గోల ఉండదు.. అప్పుడు పోలింగ్ శాతం పడిపోయిందన్న మాట ఉండదు.. ఇది హైదరాబాద్ ఓటింగ్ రహస్యం.
previous post