వేసవి సెలవులు ముఖ్యంగా ఎలక్షన్లు పూర్తికావడం, విద్యార్థుల పరీక్షల ఫలితాలు విడుదలైన నేపధ్యంలో, తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో తిరుమలలో జూన్ 30 వరకు శుక్ర, శని, ఆది వారాలలో వి.ఐ.పి బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసిందిముఖ్యంగా, శుక్ర, శని, ఆదివారాలలో సామాన్య భక్తుల రద్దీ వలన, వారు దర్శనానికి సుమారు ౩౦,40 గంటల సమయం వరకు క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి వుండడం తో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పించేందుకుగాను, జూన్ ౩౦వ తేదీ వరకు శుక్ర శని, ఆది వారాలలో బ్రేక్ దర్శనం రద్దు చేయడం వలన సిఫార్సు లేఖలు స్వీకరించబడవని ఈ మార్పును గమనించి భక్తులు టి.టి.డికి సహకరించవలసినదిగా విజ్ఞప్తి చేసింది.
previous post