విశాఖలో వైసీపీకి షాక్
చేజారనున్న మేయర్ పీఠం
గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ పై మళ్ళీ తెలుగు దేశం జెండా ఎగరనుంది..జీవీఎంసీ పరిధిలో భీమిలి, గాజువాక, విశాఖ ఈస్ట్, నార్త్, సౌత్ ప్రాంతాలకు చెందిన అధికార వైసిపి నుంచి 14 మంది కార్పొరేటర్లు టీడీపీ లోకి జంప్ చేసారు..పార్టీ మారొద్దని మాజీమంత్రి అమర్ నాథ్ చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి మాజీ మంత్రి ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన కార్పొరేటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తూ అధికారం లో వుండగా తమని ఎవ్వరు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్ ఛాంబర్లో నిర్వహించిన సమావేశానికి 25 మంది కార్పొరేటర్లు డుమ్మా కొట్టడం తో వీరి చేరిక దాదాపు గా కన్ఫర్మ్ అయిందంటున్నారు. విశాఖ జీవీఎంసీ పరిధిలో 98 డివిజన్ లు వుండగా 58 వైసిపి…30 టీడీపీ, పది మంది జనసేన, బిజెపి ఇతర పార్టీలు గెలుచుకున్నారు…. ఇప్పుడు పద్నాలుగు మంది వైసిపి నుంచి పార్టీ మారగా రేపు ఎల్లుండి లో మరింతమంది టీడీపీ, జనసేన లోకి అప్పారి శ్రీవిద్య, గుడ్ల విజయ్ సాయి, మాసిపోగు మేరీ జోన్స్ , చెన్న జానకిరామ్, పెద్దిశెట్టి ఉషశ్రీ, కంటిపాము కామేశ్వరి, వావిలపల్లి ప్రసాద్, ముర్రు వాణి లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షం లో చేరే అవకాశం ఉందంటున్నారు
ఈ మొత్తం వ్యవహారం లో ఒక ఎమ్మెల్యే చక్రం తిప్పినట్టు స్పష్టమవుతోంది. అయితే గత వైసిపి ప్రభుత్వం నాలుగేళ్ల వరకు ఎటువంటి అవిశ్వాసం పెట్టేందుకు వీలు లేకుండా అప్పట్లో ఉత్తర్వులు జారీ చేసింది దానిని మార్పు చేస్తే తప్ప ఏ విధమైన ప్రక్రియ ముందుకు జరిగే అవకాశం లేదు. ఇక స్టాండింగ్ కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్లే ఓట్లు వేయాలి కాబట్టి వారికి నచ్చిన వారికి వేసుకునే అవకాశం ఉంది. అత్యవసర క్యాబినెట్ చట్ట సవరణకు వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టడానికి రంగం సిద్దమైందని రాజధాని నుంచి వచ్చిన సమాచారం తోనే కార్పోరేటర్లతో సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలిసింది…
గతంలో టిడిపి అధికారంలో ఉన్నపుడు కూడా ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా స్థానిక సంస్థలకి నాలుగేళ్లు ఎన్నికలు జరపలేదు. ఇదిలా వుండగా కార్పొరేటర్ తోట పద్మావతిని వైసీపీలోనే కొనసాగుతున్నట్లు ప్రకటన విడుదల చేసారు.. టిడిపిలో చేరానన్న వార్తలు వాస్తవం కాదని వైయస్సార్సీపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందడం వల్ల చాలా బాధపడ్డాను. అయినా జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాను. తాను ఏ పార్టీలో చేరనని, వైయస్సార్సీపీలో కొనసాగుతానని, కొంతమంది తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి ప్రకటనలు నమ్మవద్దని, వైయస్సార్సీపి ఎవర్ని బలపరిస్తే వారికి మద్దతు ఇవ్వడానికి ఓటు వేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని తోట పద్మావతి ప్రకటించారు ఇదిలా వుంటే రాజకీయంలో ఏదైనా సాధ్యమేనని .. హెచ్చరికలు కూడా నీటి మీద రాతలేనని మరోసారి తేలిపోయింది. వైఎస్సార్సీపి నుంచి ఎవరొచ్చినా టిడిపిలోకి తీసుకోకూడదని ఆఖరికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల వద్ద పనిచేసిన పిఏలను, పీఆర్వోలను, గన్ మేన్ లను సైతం ఎట్టి పరిస్థితులలోనూ తీసుకోవద్దు.. అని ఆదేశించిన టిడిపి.. కార్పోరేటర్లను మాత్రం చక్కగా తీసేసుకుంటుందని వైసిపి నేతలు విమర్శిస్తున్నారు..
వ్యక్తిగత కారణాలతోనే కార్పొరేటర్లు పార్టీ వీడారు- కె కె రాజు
వైసీపీకి చెందిన కార్పొరేటర్లు తెలుగుదేశం మరియు జనసేన పార్టీలో చేరడంపై విశాఖ ఉత్తర నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కె కె రాజు స్పందిస్తూ.. ఎన్నికల అనంతరం పలు దఫాలుగా కార్పొరేటర్లతో సమవేశం ఏర్పాటుచేసి సమన్వయం పరిచే ప్రయత్న చేసానని అన్నారు. పార్టీ వారికి అన్ని విధాల అవకాశం కల్పించి కార్పొరేటర్ గా టికెట్ ఇచ్చి గెలుపుకు సహకరించి వారి రాజకీయ ఎదుగుదలకు పార్టీ తోడ్పడిందని అన్నారు. వారి వ్యక్తిగత కారణాలతోనే కార్పొరేటర్లు పార్టీ వీడారని, రాజకీయాలలో గెలుపు ఓటములు సహజమని, నేను ఒక సేవకుడిగా నియోజకవర్గ ప్రజలకు , కార్యకర్తలకు , నాయకులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆయన తెలియజేశారు