Vaisaakhi – Pakka Infotainment

ఫామ్ లోకి తమిళ డైరెక్టర్లు

బాహుబలి తో సౌత్ సినిమా పాన్ ఇండియా మూవీగా మారడంతో బాలీవుడ్ ఒక్క సారిగా కుదేలైపోయింది. రొటీన్ స్టోరీలతో బోర్ కొడుతున్న బాలీవుడ్ మూవీలను చూసేందుకు నార్త్ ఆడియన్స్ ఆసక్తి కనపరచలేదు. రాజమౌళి ప్రభాస్ కాంబోలో వచ్చిన బాహుబలి సిరీస్ నార్త్ ఆడియన్స్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానులను అలరించింది. దీంతో తొలి పాన్ ఇండియన్ మూవీ గా బాహుబలి రికార్డులకెక్కింది. అదే స్థాయిలో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లను కుమ్మరించింది. గతంలో తమిళ్ టాప్ డైరెక్టర్లు మణిరత్నం, శంకర్ లు తీసే భారీ బడ్జెట్ మూవీలు డబ్బింగ్ అయ్యి తెలుగు, హిందీలో బాగా సొమ్ము చేసుకునేవి. రాజమౌళి హవాతో తమిళ సినిమా ఒక విధంగా బోసిపోయిందనే చెప్పాలి. కోట్లు కుమ్మరించే సినిమా ఆమధ్య వచ్చిందంటే లేదనే చెప్పాలి. అయితే విక్రమ్ సినిమాతో తమిళ్ సినిమా మళ్లీ పూర్వ వైభవాన్ని తెచ్చుకుంది. ఆ తర్వాత జైలర్ సినిమా కూడా అదే స్థాయిలో ఆడింది. ఇక తమిళ్ డైరెక్టర్ అట్లీ కుమార్ తీసిన జవాన్ మూవీ కూడా అన్ని భాషలలో కూడా బాక్సాఫీసును షేక్ చేస్తుంది. ఇది పూర్తిగా తమిళ సినిమా కానప్పటికీ. డైరెక్టర్ తమిళయన్ కావడంతో పేరు కూడా డైరెక్టర్ అట్లీ కుమార్ ఖాతాలో పడిపోయింది. అయితే అంతకుముందు మణిరత్నం తీసిన పాన్ ఇండియన్ మూవీ పొనియన్ సెల్వన్ సో సో గా ఆడీ కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయి. కానీ ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టుకోలేకపోయింది. ఇండియన్ సినిమా పై తెలుగు సినిమా హవా కొనసాగుతుండడం నార్త్ ఆడియన్స్ కి అస్సలు నచ్చడం లేదు. దీనికి తోడు పక్కనే ఉన్న తమిళ్ డైరెక్టర్లు కూడా కుళ్లు కుంటున్నారు. అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. తెలుగులో ఏ చిన్న హీరో చేసిన అది పాన్ ఇండియన్ సినిమాగా మారి విజయవంతం అయిపోవడం చాలామందికి నచ్చడం లేదు. తమిళ్ డైరెక్టర్లు పూనకం వచ్చినట్లు ఒక్కసారిగా తమలో ఉన్న టాలెంట్ ను పైకి తీసుకొచ్చారు. వరుసగా మూడు పెద్ద హీట్లను ఇచ్చారు. ఇందులో లోకేష్ కనగరాజు- కమలహాసన్ కాంబోలో వచ్చిన విక్రమ్ మూవీ ఒకటి కాగా, మరొకటి రజనీకాంత్ -నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ మూవీ ఉంది. ఇక తమిళ్ డైరెక్టర్ అట్లీ కుమార్ – షారుక్ ఖాన్ కాంబోలో వచ్చిన జవాన్ కూడా కోలీవుడ్ లిస్టులోకి చేరిపోయింది. తమ సినిమాలను ఎంత కసిగా తీసారో ఆ సినిమాలకు వస్తున్న కలెక్షన్లు చెబుతున్నాయి. పాన్ ఇండియన్ రేంజిలో హడావిడి చేస్తున్న తెలుగు డైరెక్టర్లకు, హీరోలకు కోలీవుడ్ వరుస విజయాలతో తన సత్తా చాటుతూ సవాల్ విసురుతుంది. ఇక తెలుగు నుంచి నెక్స్ట్ వచ్చే పాన్ ఇండియన్ మూవీ సలార్ మీదే అందరి ఆశలు ఉన్నాయి.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More