Vaisaakhi – Pakka Infotainment

అధికారిక క్రీడ గా శృంగార పోటీలు నిర్వహిస్తున్న స్వీడన్..?

దేశం ఏదైనా.. సంస్కృతి ఏదైనా.. శృంగారం అన్న క్రియ మాత్రం రహస్యం గా జరిగే ఓ ప్రక్రియ.. ఆ సంబంధం సక్రమమైన.. అక్రమమైన.. సీక్రెట్ గానే కార్యక్రమం జరగాలనుకుంటారు.. రహస్యం గా నాలుగ్గోడల మధ్య జరిగే దీన్ని ఇప్పుడు ఓ దేశం బహిర్గతం చేయడమే కాకుండా ఏకంగా అధికారిక క్రీడగా గుర్తించి పోటీలు నిర్వహిస్తోంది…. శృంగార సంపర్కాన్ని అధికారిక క్రీడగా గుర్తించిన మొట్టమొదటి దేశం స్వీడన్ ఇప్పుడు హాట్ టాపిక్ దేశమైంది.. జూన్ ఎనిమిదో తేదీ నుంచి ఆరు వారాలపాటు శృంగార ఛాంపియన్ షిప్ వార్తను చూసిన వారంతా ఇప్పుడు నోరెళ్లబెడుతున్నారు. స్వీడిష్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరగబోతున్న ఈ ఛాంపియన్ షిప్ లో పోటీదారులకు ప్రతిరోజూ 6 గంటల సెషన్లు, 45 నుంచి 60 నిమిషాలపాటుసాగే వ్యక్తి గత మ్యాచ్ లను ముగ్గురు న్యాయమూర్తుల ప్యానెల్ పరిశీలించి చాంపియన్ షిప్ విజేతలను నిర్ణయించనుంది. ఇందులో ప్రేక్షకుల ఎంపిక కూడా ఉంటుంది.. జడ్జిమెంట్ పారామీటర్‌లో జంటల కెమిస్ట్రీ, సెక్స్‌పై వారి అవగాహన, ఓర్పు స్థాయి మొదలైనవి ఉండగా ప్రేక్షకుల ఓటింగ్ 70 శాతం ఉంటుంది, మిగిలిన 30 శాతం న్యాయమూర్తుల స్కోర్‌ల నుండి వస్తుంది. సెడక్షన్, ఓరల్ సెక్స్, పెనిట్రేషన్, ఓర్పు, బాడీ మసాజ్‌లు, ఫోర్‌ప్లే, ఎరోటిక్ జోన్‌లతో సహా 16 విభాగాల లైంగిక కార్యకలాపాలలో పోటీలు జరగగా ప్రతి విభాగంలో, టోర్నమెంట్ పాల్గొనేవారు 5 నుండి 10 పాయింట్లను పొందవచ్చు. పాయింట్లు పబ్లిక్ మరియు ఐదుగురు న్యాయమూర్తుల కమిటీ ద్వారా ఇవ్వబడతాయి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు సంస్కృత పాఠం “కామసూత్ర” కూడా పరిగణనలోకి తీసుకోబడుతుంది మరియు పాల్గొనేవారు ప్రాచీన భారతీయ వచనంపై వారి అవగాహన ఆధారంగా బోనస్ పాయింట్లను అందుకుంటారని స్వీడిష్ సెక్స్ ఫెడరేషన్ తెలిపింది. వివిధ దేశాల నుండి ఈ పోటీలో పాల్గొంటారని స్వీడిష్ ఫెడరేషన్ ఆఫ్ సెక్స్ యొక్క ఛైర్మన్ బ్రాటీచ్ చెప్పారు.. క్రీడా వ్యూహాలలో భాగంగా లైంగిక ధోరణిని చేర్చడం అనేది యూరోపియన్ దేశాలలో సంచలనాత్మకమైన నిర్ణయమంటూనే సెక్స్‌ను ఒక క్రీడగా గుర్తించడం అనివార్యం,” అన్నారు. అయితే ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వార్త ను స్వీడన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించకపోవడం తో ఇదంతా ఉత్తినే అన్న వార్త కూడా ప్రచారం లోకొచ్చింది.. ఇందులో నిజం ఎంత అన్నది స్వీడన్ ప్రభుత్వ ప్రకటన తో తేలనుంది

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More