వై సి పి పార్టీ కి , ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో మరోసారి చుక్కెదురయింది.. ఏకపక్ష ఫలితాలు రాబోతున్నాయని సర్వేలు, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న తరుణం లో ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి కి ఆఖరి ఎదురుదెబ్బ గట్టిగానే తగిలింది..పోస్టల్ బ్యాలెట్ కి సంభందించి ఎలెక్షన్ కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులకు సంబంధించి వైకాపా వేసిన రిట్ పిటిషన్ ను హైకోర్టు కోర్టు కొట్టివేసింది. అలాగేహైకోర్టు ఉత్తర్వల పైన ఈ రోజు సుప్రీం కోర్టు జస్టిస్ అరవింద్ కుమార్ మరియు సందీప్ మెహతా ల తో కూడిన ధర్మాసనం విచారణ చెబట్టింది. వైకాపా తరపున అభిషేక్ సింఘ్వీ. వాదనలు వినిపించారు.తెలుగు దేశం కి చెందిన వెలగపూడి రామకృష్ణ ఇప్పటికే కేవియాట్ దాఖలు చేయగా. వారి తరపున సీనియర్ న్యాయవాది ఆదినారాయణ, సిద్ధార్థ లూత్ర, రవితేజ పదిరి, జవ్వాజి శరత్ లు వాదనలు వినిపించారు.ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవటానికి నిరాకరించి ఎస్.ఎల్ .పి డిస్మిస్ చేసింది. దీంతో అధికార వైసీపీ కి చిట్టచివరి దెబ్బ సుప్రీం లో తగిలింది.. ప్రపంచంలో ఏ ప్రభుత్వానికి ఇన్ని ఎదురు దెబ్బలు మొట్టికాయలు తగిలివుండవని అంటున్నారు.. ఐ పీ ఎస్ , ఐ ఏ ఎస్ లని తేడా లేకుండా చాలా మంది అధికారులు కోర్టు గుమ్మాలెక్కి చీవాట్లు తిన్న సంధర్భానికి ఈ ప్రభుత్వ నిర్ణయాలే కారణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.. లోకల్ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు అన్ని చోట్లా ఎన్నో భంగపాట్లు కి గురైన వైసీపీ ప్రభుత్వం కి చివరిదెబ్బ కూడా తగలడం తో ఎదురుదెబ్బల పర్వం పరిపూర్ణమైంది.
previous post