చంద్రప్రచండంగా భగ భగ లాడించిన భానుడు సడన్ గా సైలెంట్ అయిపోయాడు.. రోహిణి కార్తెల్లో విశ్వరూపం చూపించాల్సిన టైం లో వరుణుడు అడ్డుపడటం తో సగం లొనే సమ్మర్ నుంచి తప్పుకోవాల్సొచ్చింది.. హఠాత్తుగా ఏర్పడ్డ ఉపరితల ఆవర్తన ద్రోణి రెండు తెలుగు స్టేట్ లను చినుకులతో చల్లబరిచేసింది. ఒకటి రెండు రోజులుండి వెళ్లిపోతుందనుకుంటే మే 22 నుంచి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం.. ఉందని వాతావరణ శాఖ మరో చల్లని కబురు చెప్పింది. దక్షిణ ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, రాయలసీమ మీదుగా సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో ద్రోణి బలహీన పడిందని చెపుతూ ఏపీ, యానాంలో ఆగ్నేయ-నైరుతి దిశగా గాలులు వీస్తున్నట్లు ఐఎండి తెలిపింది ప్రకారం దక్షిణ అంతర్గత తమిళనాడు & పరిసరాల్లో ఆవర్తనం కొనసాగుతుందని, మధ్య మహారాష్ట్ర నుండి దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి విస్తరించి ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. బుధవారం నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఇది ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం నాటికి వాయుగుండంగా కేంద్రీకృతమై అవకాశం ఉందన్నారుదీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని అనేక జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తెలిపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ సూచించారు. మరోవైపు మరికొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.. ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.ఇదిలా ఉండగా 122 సంవత్సరాలలో 2023 అత్యంత వేడి సంవత్సరాలలో ఒకటి నిలిచింది.. 2024 దానిని అధిగమించి అధిక వేడి రికార్డు ను సృష్టించిందని భారత వాతావరణ శాఖ (IMD) పేర్కొంది. సాధారణం కంటే ఎక్కువ వేడి తరంగాల రోజులతో వేసవి ఉధృతంగా ఉందని హెచ్చరించింది. ఏప్రిల్ 2024లో, దక్షిణ ద్వీపకల్పంలోని అనేక ప్రాంతాలు, వాయువ్య మధ్య భారతదేశం, తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు మరియు వాయువ్య భారతదేశంలోని మైదానాలలో సాధారణం కంటే ఎక్కువ వేడిగాలులను అనుభవించింది IMD తెలిపింది. అయితే వాటన్నింటినుండి పూర్తి ఉపశమనం లభించినట్టే అయింది..ఇప్పటికే అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు. మాల్దీవులు, కొమోరిన్, దక్షిణ బంగాళాఖాతంలో విస్తరించి మే31 నాటికి కేరళ ను తాకనుండగా జూన్ మొదటి వారం లోనే తెలుగు రాష్ట్రాల్లో తొలకరి మొదలుకానుంది.. ఆవర్తన ద్రోణి, వెనువెంటనే అల్పపీడనం, ఆ వెంబడి రుతుపవనాలు ఇవన్నీ చూస్తే సమ్మర్ ఇక వెళ్లిపోయినట్టేనని మాన్సూన్ ఫెస్టివల్ మొదలెట్టేసారు మన జనం.
previous post
next post