తిరుమల శ్రీవారి బ్రహ్మత్సవాలు అక్టోబరు నాలుగు నుండి జరగ నున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది..
2024లో అధిక మాసం లేని కారణంగా సాలకట్ల బ్రహ్మోత్సవం (సాలకట్ల అంటే వార్షికం) మరియు నవరాత్రి బ్రహ్మోత్సవాలు కలిపి ఒక బ్రహ్మోత్సవం మాత్రమే జరుగుతుందని తెలిపింది.
మూడవ తేదీ రాత్రి 7 నుండి 8 వరకు అంకురార్పణ, విశ్వక్సేన ఆరాధన జరుగుతుందని 4 వ తేదీ మొదటి రోజు ఉత్సవం లో భాగంగా మధ్యాహ్నం: 3.30 నుండి 5.30 వరకు బంగారు తిరుచ్చి ఉత్సవం సాయంత్రం 6 గంటలకు – ద్వజారోహణం (ధ్వజారోహణం) రాత్రి 9 గంటల నుండి 11 గంటల వరకు – పెద్ద శేష వాహనం పై శ్రీవారి వూరేగింపు జరుగుతుంది.
5 వ తేదీ శనివారం రెండవ రోజు ఉదయం 8 నుండి 10 వరకు -చిన శేష వాహనం మధ్యాహ్నం 1 గంటల నుండి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం (ఉత్సవర్లకు అభిషేకం) రాత్రి 7 నుండి 9 గంటల వరకు – హంస వాహనం 6వ తేది మూడవ రోజు ఉదయం 8 నుండి 10 వరకు – సింహవాహనం మధ్యాహ్నం 1 గంటల నుండి 3 గంటల వరకు – స్నపన తిరుమంజనం (ఉత్సవర్లకు అభిషేకం) రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు ముత్యాల పల్లకీ వాహనం (ముత్యపు పందిరి వాహనం) 7 వతేదీ సోమవారం నాల్గవ రోజు ఉదయం 8 నుండి 10 వరకు కల్పవృక్ష వాహనం సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వరకు – సర్వభూపాల వాహనం 8వ తేదీ మంగళవారం 5వ రోజు ఉదయం 8 నుండి 10 వరకు – మోహినీ అవతారం రాత్రి: సుమారు 7 గంటల నుండి 12 గంటల వరకు – గరుడ వాహనం 9 నబుధవారం ఆరవ రోజుఉదయం 8 నుండి 10 వరకు – హనుమంత వాహనం సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు స్వర్ణ రథోత్సవం (స్వర్ణ రథం) రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు – గజవాహనం 10వ తేదీ గురువారం ఏడవ రోజు ఉదయం 8 నుండి 10 వరకు – సూర్య ప్రభ వాహనం మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు – స్నపన తిరుమంజనం (ఉత్సవర్లకు అభిషేకం) రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు – చంద్రప్రభ వాహనం 11వ తేదీ శుక్రవారం 8వ రోజు ఉదయం 6 గం – రథోత్సవం (రథం, రథోత్సవం) సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వరకు – అశ్వవాహనం 12 వ తేదీ శనివారం – 9వ రోజు తెల్లవారుజామున 3 నుండి 6 గంటల వరకు – పల్లకీ ఉత్సవం మరియు తిరుచ్చి ఉత్సవం ఉదయం 6 నుండి 9 వరకు – స్నపన తిరుమంజనం, చక్రస్నానం తో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.