తిరుమల శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడ వాహన సేవ అత్యంత వైభవోపేతంగా జరిగింది. సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు భక్తులు సర్వపాప ప్రాయశ్చిత్తం గా భావించే గరుడ వాహన సేవ 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు. జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తుల నమ్మకం.
previous post