అంతరించిపోతున్న పిచ్చుకల సంతతిని పెంచుడానికి కృషి చేస్తూ, మన ఇంటి పరిసరాలకు వచ్చే పిచ్చుకలకు ఆహారపు గింజలను వేసి, వాటి సంరక్షణ మన బాద్యతగా స్వీకరించేందుకు గ్రీన్ క్లైమేట్ టీమ్ స్వచ్ఛంద సంస్థ నడుం బిగించింది. జివిఎంసి ఆధ్వర్యంలో ఈ సంస్థ ఏర్పాటు చేసిన “పిచ్చుకల సంతతి పెరగడానికి కృషి చేద్దాం” అనే కార్యక్రమంలో భాగంగా మట్టి పిచ్చుక గూడులను, మట్టి పాత్రలను నగర మేయర్ గోలగాని హరి వెంకటకుమారి పంపిణి చేశారుj. పిచ్చుకల సంతతి క్రమేపి అంతరించి పోతున్న తరుణంలో వాటి సంతతిని పెంచి, సంరక్షిచుకోవలసిన భద్యత మనందరిపై వుందని ఆమె పిలుపునిచ్చారు మనుష్యులే రోడ్ పైన నడవలేకపోతున్న ఈ వేసవి కాలంలో వాటికి దాహార్తిని తీర్చి కాపాడుకోవాలని ఈ వేసవి కాలంలో పక్షులు, ఇతర జీవుల కోసం చిరు ధాన్యాలను, మంచి నీటి వసతి కల్పించడం మన తక్షణ కర్తవ్యం మేయర్ అన్నారు. ప్రధానంగా పిచ్చుకలు వరి పంటను ఆశించే నల్లి పురుగులను, మన ఇళ్ళలో హాని కలిగించే క్రిమి కీటకాలను ఆహారంగా తీసుకుంటాయన్నారు. వేలాది సంవత్సరాలుగా మన పూర్వీకులు ఇంటి ముందు వరి కంకుల గుత్తులను ఇళ్ళకు వేలాడదీసేవారని, ఆ పద్దతిని మనం అవలంబించేందుకు నగరంలో వున్న “గ్రీన్ క్లైమేట్ టీమ్ స్వచ్ఛంద సంస్థ” జివిఎంసి ఆధ్వర్యంలో ప్రజల అవగాహన కొరకు 400 మట్టి పిచ్చుక గూడులను, మట్టి పాత్రలను పంపిణి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఆనందం వ్యక్తం చేస్తూ, ఆ టీమ్ ప్రతినిధులను అభినందించారు. నిరంతరం “గ్రీన్ క్లైమేట్ టీమ్ స్వచ్ఛంద సంస్థ” సమాజ శ్రేయస్సుకు, పర్యవరణ పరిరక్షణకు, మూగ జీవుల సంరక్షణ స్వచ్ఛంద సేవలకు ఎప్పుడు ముందడుగు వేయడం చాల సంతోషదాయకం అన్నారు. అనంతరం, మట్టి పిచ్చుక గూడులను జివిఎంసి సిబ్బందికి, పౌరులకు పంపిణీ చేస్తూ, నగరంలో గల నివాసితులు ఇంటి పరిసరాలలో మూగ జీవులకు, పక్షులకు, పిచ్చుకలకు మంచి నీటిని, ఆహారాన్ని అందుబాటులో వుంచి వాటి సంతతిని పెంచి, సంరక్షించుకోవలసిన బాధ్యతను చేపట్టాలని సూచించారు.
previous post
next post