ప్రపంచంలో వెన్నెముక గల జంతువులే కాదు మొత్తం జీవరాశి అంతా దాదాపు 60 కోట్ల సంవత్సరాల నుంచి నిద్రపోతూనే ఉన్నాయి. మెదడు చురుగ్గా పనిచేసేందుకు ఉపయోగపడే న్యూరాన్లకు శక్తి కావాలి పగలంతా అది పనిచేస్తుంది రాత్రి అయేసరికి మెదడు అలిసిపోతుంది తిరిగి చురుగ్గా పనిచేసేందుకు న్యూరాన్లకు శక్తి కావాలి అంటే రెస్ట్ అదే నిద్ర కావాలి. ప్రపంచంలో కొన్ని జీవులు రెండు గంటలు పడుకుంటే మరికొన్ని రెండు గంటలు మాత్రమే మెలకువగా ఉండి 22 గంటలు ఘాడనిద్రలో గడిపేస్తాయి తిమింగలం డాల్ఫిన్ లాంటివి చిత్రంగా నిద్రపోతాయి వీటి మెదడు లో ఒక భాగం నిద్రపోతే రెండో భాగం మెలకువ ఉంటుంది ఎందుకంటే ఇవి నీటి పైభాగానికి వచ్చి గాలి పీల్చుకోవాలి మరి మొత్తంగా పడుకుంటే వాటికి ప్రమాదం కూడా. వేల కొద్ది మైళ్ళ వలస పోయే పక్షులు కూడా ఎగురుతూనే ఒకన్ను ఓసారి మరో కన్నుతో ఇంకోసారి నిద్రపోతాయి ఇక అసలు విషయానికొస్తే చింపాంజీ జాతికి చెందిన కోలా అనే జంతువు 22 గంటలు, బిగ్ బ్రౌన్ గబ్బిలం 20 గంటలు, నీటి అపోసం అనే ఎలుక జాతికి చెందిన జంతువు 19 గంటలు, అడ్మిటిల్లో అనే జంతువు 18 గంటలు, ఓల్డ్ మంకీ 17 గంటలు, పిల్లి 15 గంటలు, నేల ఉడత 14 గంటలు, చిట్టెలుక 13 గంటలు, గొరిల్లా సింహం లాంటివి 12 గంటలు, జాగ్వర్ లాంటివి 11 గంటలు, చింపాంజీ 10 గంటలు పొట్టి తోక ఎలుక 9 గంటలు, కుందేలు ఎనిమిది గంటలు, మనిషి సగటున ఏడుగంటలు, శీల్ చేప ఆరు గంటలు, ఆవు ఏనుగు నాలుగు గంటలు, గాడిద జీబ్రా గుర్రం తదితరవి మూడు గంటలు, జిరాఫీ రెండు గంటలు నిద్రపోతాయి శీతాకాలంలో కొన్ని ప్రాంతాల్లోని కొన్ని రకాల గబ్బిలాలు ఉడతలు పాములు కప్పలు ఒంట్లో పేరుకున్న కొవ్వు నిలువలను కరిగించుకుంటూ నెలలు తరబడి ఆహారం తీసుకోకుండా నిద్రలోనే జోగుతూ ఉంటాయి ఇది నిద్ర సంగతి