ఏడాదిలో రెండు ఋతువులు మాత్రం చాలా ప్రత్యేకం అవి వసంత, శరదృతువులు. వసంత ఋతువు చైత్ర వైశాఖ మాసాలలో వస్తే శరదృతువు ఆశ్వయుజ కార్తికాలలో వస్తుంది. ఈ రెండింటినీ సంవత్సరారంభాలు వర్ణిస్తారు. భగవదారాధనలో ఈ రెండు ఋతువులకు ప్రత్యేక స్థానం ఉంది.. శరన్నవరాత్రులు, వసంత నవరాత్రులు ఈ రెండు విశిష్ట పర్వదినాలు ఈ రెండు ఋతువుల సమయంలోనే జరుపుకుంటారు.. వాతావరణంలో ఒకవిధమైన సమ లక్షణం ఉండటం వలన ఈ రెండు ఋతువులలో వచ్చే పౌర్ణమిలకు విశేష ప్రాధాన్యం ఉంది. మొత్తం నాలుగు పౌర్ణమి లు ఈ రెండు ఋతువుల్లో వస్తాయి చైత్ర పూర్ణిమ, వైశాఖ పూర్ణిమ, ఆశ్వయుజ పూర్ణిమ, కార్తిక పూర్ణిమ. ఈ నాలుగు దేనికవే ప్రత్యేకమైనవి ప్రత్యేక ఆరాధనలకి విశేష పూజలకు ఇవి ఎంతో విశిష్టమైనవని శాస్త్రాలు చెపుతున్నాయి.. మహా వైశాఖి గా పిలవబడే వైశాఖి పౌర్ణమి ఒక సంపూర్ణమైనటువంటి వ్రతం. ఈరోజున ఆధ్యాత్మిక సాధనలు పూజలు చేస్తే అధికఫలాలు ఇస్తాయని శాస్త్రం చెప్తున్నది. అలాగే ఆశ్వయుజ పూర్ణిమకు ‘ప్రతిపన్ముఖ్యరాకాంత తిథిమండల పూజితా” అనే నామంలోనే ‘ముఖ్యరాకా’ అని చెప్పారు. అప్పుడు అమ్మవారి ఆరాధనలు అత్యంత విశిష్టమైన ఫలితాలను ఇస్తాయి అని పండితులు చెపుతుంటారు. అదేవిధంగా కార్తిక పూర్ణిమ కృష్ణ పూజకి, అమ్మవారి ఆరాధనకి, శివారాధనకు అత్యంత ప్రాధాన్యం కలిగినది. ఇవి కాకుండా సంవత్సర మధ్య కాలంలో వుండే ఆషాఢపూర్ణిమ కు మరో ప్రాధాన్యం ఇచ్చారు. దక్షిణాయణ పుణ్యకాలంలో వచ్చేఈ పూర్ణిమ కు కూడా ప్రాముఖ్యత ఉంది. ఇవి ప్రధాన పూర్ణిమావ్రతాలు గా శాస్త్రం చెప్తున్న ఈ పూర్ణిమ లతో పాటు మాఘమాసంలో యజ్ఞ సంబంధమైన పౌర్ణమి కూడా విశేషమైనదే… ఇలా సంవత్సర కాలంలో ఆరు ప్రధానమైన పౌర్ణమి లు ఆధ్యాత్మికంగాఎంతో ప్రముఖమైనవి..
previous post
next post