Vaisaakhi – Pakka Infotainment

శతృఘ్నుడికి కూడా గుడి ఉందా..?

అయోధ్య బాలరామ ప్రతిష్ట తరువాత దేశమంతా ఒక్కసారిగా రామమయమై పోయింది.. నిజానికి ఒకప్పుడు రామాలయం లేని గ్రామం ఉండేది కాదు.. ఇప్పుడైతే గ్రామాలన్నీ కాంక్రీటుమయం అయిపోవడంతో రాముడి గుడి మండలానికి ఒకటిగా మారినా అంతా రామమయం ఈ జగమంతా రామమయం గానే ఉంది.. అలా రాముడి గుడి ఉండడం సహజం హనుమంతుడి దేవాలయాలు కూడా ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి.. మరి శతృఘ్నుడికి గుడి ఉందన్న విషయం తెలుసా..? రామాయణంలో రాముడి వెంట లక్ష్మణుడు వనవాసానికి వెళ్లాడు రావణ సైన్యం తో యుద్ధం చేశాడు.. సోదరుడు అంటే లక్ష్మణుడే అనేటట్లు గా ప్రాధాన్యత ఉంది..అయితే రాముడు అరణ్యవాసం చేసి తిరిగి వచ్చేవరకు రామపాదుకలను సింహాసనం పై ఉంచి రాజ్యపాలన చేసాడు భరతుడు… మరి ఇలాంటి ప్రత్యేకత ఈ సోదరులకు ఉంది అయితే మరో సోదరుడు శతృఘ్నుడు గురించి ఎక్కడా ప్రముఖంగా ప్రస్తావించిన ఎక్కడా ఏ రామాయణంలోనూ పెద్దగా పేరు వినిపించని పాత్ర… అలాంటి
శతృఘ్నుడు కి కూడా గుడి ఉందని తెలుసా..? శతృఘ్నుడికి ఒకటి కాదు మూడుగుడులు ఉన్నాయి అవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే.. ఒకటి కేరళ లోని త్రిసూర్ జిల్లా, పాయమ్మాళ్ శ్రీ శతృఘ్నస్వామి టెంపుల్. భక్తులు నలంబలం (నాలుగు దేవాలయాలు) యాత్ర లో భాగంగా దర్శించే నాల్గవ ఆలయం . మలయాళ మాసం కర్కిడకంలో నలంబలాన్ని సందర్శించడం ఒక పవిత్రమైన కార్యక్రమం ,రెండు ఉత్తరాఖండ్ లోని రిషికేశ్ దగ్గర మునికీరేతి దగ్గర నిరంతర గంగాప్రవాహం నడుమ శతృఘ్న ఘాట్ సమీపంలో ఉంది దేవాలయం.. ఇక మూడవ దేవాలయం యూపీలోని మధుర, మహోలి రోడ్ అనంద్ పూర్ లో ఉంది.. మరి శతృఘ్నుడికి గుడి కట్టేంత గొప్పతనం ఏముంది… అని ఓసారి పరికిస్తే లక్ష్మణుడికి కవలసోదరుడు… రాముడికి వీర విధేయుడు… మంచి పరిపాలన సామర్ధ్యం ఉన్నవాడు… రామవనవాసం అనంతరం రాముడి లేని అయోధ్యలో నేను ఉండను ఉంటూ భరతుడు బయట ఆశ్రమం ఏర్పాటు చేసుకుని జీవిస్తుంటే… మొత్తం అయోధ్య రాజ్యభారాన్ని, యంత్రాంగాన్ని నడిపింది శతృఘ్నుడే … ఆ పద్నాలుగేళ్లు ఆ ముగ్గురు తల్లులకు శతృఘ్నుడే ఊరట, ఓదార్పు…జనకరాజు తమ్ముడు కుశధ్వజుడి బిడ్డ శృతకీర్తి శత‌ృఘ్నుడి భార్య… తనకు ఇద్దరు కొడుకులు సుబాహు, శతృఘటి… మంథర వల్లే రాముడి వనవాసం అనే కోపంతో… కైకేయి ఆనందంగా ఇచ్చిన నగలు, విలువైన చీరెలు ధరించి మంథర తిరుగుతుంటే, ఓ దశలో శతృఘ్నుడు ఆమెను చంపబోతాడు… కైకేయి అభ్యర్థన మేరకు భరతుడు వారిస్తాడు… స్త్రీ హత్య మంచిది కాదనీ, రాముడు కూడా హర్షించడు అని చెప్పడంతో తగ్గిపోతాడు…శతృఘ్నుడి పాత్ర మొత్తం రామాయణంలో ఇంతేనా అంటే అంతకు మించి అన్నట్టు ఉంటుంది.. రావణుడికి కుంభిణి అనే సోదరి ఉండేది… ఈమె భర్త పేరు మధు… వీళ్లకు లవణాసురుడు అనే కొడుకు… తను శివుడి తపస్సు చేసి, ఓ మహత్తు కలిగిన త్రిశూలాన్ని వరంగా పొందుతాడు… అది తన చేతిలో ఉన్నంతకాలం తనను ఎవరూ ఓడించలేరు… ప్రజాకంటకంగా మారిన లవణాసురుడిని హతమార్చాలని రామలక్ష్మణులు తలపెట్టినప్పుడు, తనకు ఆ అవకాశం ఇవ్వాలని శతృఘ్నుడు కోరుకుంటాడు…యుద్ధంలో విష్ణు అంశతో కూడిన అస్త్రాన్ని సంధించి శతృఘ్నుడు ఆ లవణాసురుడిని హతమారుస్తాడు… శతృఘ్నుడిని ఆ మధు పాలించిన రాజ్యానికి పాలకుడిగా నియమిస్తాడు… ఆ రాజ్యం పేరు మధుపుర… తరువాత కొన్నాళ్లకు శతృఘ్నుడు ఆ రాజ్యాన్ని రెండుగా… మధుపుర, విదిశగా విభజించి, తన కొడుకులిద్దరినీ పాలకులుగా నియమించి… విష్ణువు చేతిలోని శంఖావతారమైన. శతృఘ్నుడు సరయూ నదిలోకి వెళ్లి తిరిగి శ్రీ మహావిష్ణువులో ఐక్యమయిపోతాడు… అంత గొప్పతనం ఉన్న శతృఘ్నుడికి మూడు ఆలయాలేంటి.. ముప్పై వున్నా తక్కువే

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More