లయన్ కింగ్ పిల్లలనే కాదు పెద్దలని కూడా అలరించిన చిత్రం. వరల్డ్ బెస్ట్ ఎంటర్టైనర్ ఇప్పుడు దాని సీక్వెల్ లో భాగంగా దర్శకుడు భారీ జెంకిన్స్ ముఫాసా ది లయన్ కింగ్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.. 20 డిసెంబర్ న ఇంగ్లీష్ తో పాటు హిందీ, తమిళం తెలుగు భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం హిందీ వెర్షన్ కి షారూక్ ఖాన్ తన కుమారులు ఆర్యన్ ఖాన్, అబ్రామ్ ఖాన్ లతో కలసి మూఫాసా కు ప్రాణం పోశారు..
సింబగా ఆర్యన్ ,యువ మఫాసా గా అబ్రామ్ గాత్ర పోషణ తో మెప్పించగా బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ముఫాసా కు గొంతు కలిపారు.
షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ ది లయన్ కింగ్’. ముఫాసా జీవితాన్ని బాల్యం నుండి రాజుగా ఎదిగిన క్రమాన్ని అద్భుతం గా ఆవిష్కరించిందన్నారు. డిస్నీతో వున్న ప్రత్యేక అనుభందం తో ఇందులో ఆర్యన్ , అబ్రామ్, భాగం అవ్వడం ఒక మంచి అనుభూతి అని వివరించారు.
డిస్నీ స్టార్ అధినేత బిక్రమ్ దుగ్గల్ మాట్లాడుతూ డిస్నీ ఎప్పుడు కూడా క్వాలిటీ విషయం లో ఎక్కడా రాజీ పడదని ఇప్పుడు వస్తున్న ముఫాసా ది లయన్ కింగ్’ లో షారూఖ్ ఖాన్ ఆర్యన్ ఖాన్ తప్ప ఇంకెవ్వరిని ఊహించలేమని ముఫాసా, సంబాగా రావడం అందులో అబ్రామ్ కూడా చేరడం సినిమాకు అదనపు ఆకర్షణ చేరిందన్నారు.