రోజు లక్షలాది ప్రయాణీకులతో నిత్యం కిటకిటలాడే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్ట్రా మోడ్రన్ రూపం తో ఆధునీకరణ దిశ గా అడుగులు వేస్తోంది. 719 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ఈనెల 8వ తేదీన ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. విమానాశ్రయం తరహాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకున్న నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో దీనిని రూపుదిద్దనున్నారు.. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోనే అత్యుత్తమ రైల్వే స్టేషన్‌గా దీన్ని అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే ఒక ప్రణాళిక ను సిద్ధం చేశారు. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఓ ఐకాన్ గా మారే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా అదే రోజు సికింద్రాబాద్ తిరుపతి ల మధ్య నడిచే వందే భారత్ ట్రైన్ ను ప్రధాని ప్రారంభించనున్నారు.
previous post
next post