శారదా పీఠం ఏ పార్టీకి ఏ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయలేదని విశాఖ శారద పీఠాధిపతి స్వరూపనందేంద్ర సరస్వతి స్వామి అన్నారు.. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారిన నేపథ్యంలో ప్రెస్ మీట్ పెట్టిన ఆయన అనేక విషయాలను వివరించారు.. ఈ పీఠానికి ఏడు రాష్ట్రాల నుండీ గవర్నర్ లు వివిధ రాష్ట్రాల సీఎం లు వచ్చారని కేవలం వైసీపీ నాయకులు మాత్రమే పీఠానికి రాలేదని చెప్పుకొచ్చారు… ధర్మాన్ని కాపాడాలి… ఆ ధర్మం కోసం నిలబడాలి అన్నదే తమ ఉద్దేశ్యం అని పీఠం ఏ ప్రభుత్వానికి పని చేయలేదని స్పష్టం చేశారు… ఎవరికో భయపడి ఈ రోజు మీడియా ముందుకు రాలేదని తప్పుడు సంకేతాలు వెళ్లకూడదన్న సదుద్దేశంతోనే మీడియా ముందుకు వచ్చినట్లు వివరించారు. కేంద్రంలో మోడీ మరోసారి ప్రధాని కావడానికి స్వాగతిస్తున్నామనిశ్రీకాకుళం ఎంపి రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి పదవి రావడం ఆనందంగా వుంది ఉందని అన్నారు…..కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ నూతన ప్రభుత్వాలు ఏర్పడడం ఆనందం గా వుందనినేను చంద్రబాబు నాయుడు అంటే తమకు అపారమైన గౌరవం అని ఆయన్ని కొత్తగా పొగుడుతున్నానని భావించానవసరం లేదని.. ఆయన రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి అని మూడుసార్లు ముఖ్యమంత్రి గా చేసి నాలుగో సారి దివ్యమైన ముహూర్తం లో ప్రమాణస్వీకారం చేస్తున్నారని ఎల్లుండి ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని యాగం చేస్తున్నట్లు చెప్పారు. ఏ ప్రభుత్వం వచ్చిన…మేము ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతాం.. సంపాదించుకోవాలి, దోచుకోవాలని అనుకునే సిద్ధాంతం శారదా పీఠానికి లేదు..నా వ్యక్తిత్వం పెద్దలకు బాగా తెలుసు అమరావతి లో సైతం శారద పీఠం కోసం స్థలం కొన్నామని అక్కడ కూడా పీఠాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. నేను ప్రెస్ మీట్ పెట్టింది ఎవరికో భయపడి కాదుస్వరూపానందేంద్ర ఎప్పుడు ఒకేలా ఉంటారు భయపడి కాదుఈ సారి అయినా దేవాదాయ ధర్మా దయ శాఖ సరైన పాలన చేయాలని నూతన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు…
previous post
next post