Vaisaakhi – Pakka Infotainment

రూటు మార్చిన రోజా..గప్ చుప్ అయిన నాని.. !

నిన్న మొన్నటి వరకు ప్రతిపక్షాలపై విరుచుకుపడిన వైసిపి నాయకురాలు, మంత్రి రోజా వైసిపి ఫైర్ బ్రాండ్ గా పేరున్న కొడాలి నాని ఇప్పుడు స్వరం మార్చారు..ఎప్పుడూ హుషారుగా అత్యుత్సాహంతో ప్రతిపక్షాలపై కౌంటర్లు వేసి బూతులతో విరుచుకుపడే ఈ నాయకులు ఈసారి మాత్రం నిరుత్సాహవదనంతో ఆవేదనతో మాట్లాడటం కనిపిస్తుంది.. మంత్రి రోజా తన సొంత పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.ఎయిర్పోర్ట్లో ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన తన పార్టీ నాయకులు తర్వాత నియోజకవర్గం లోకి వచ్చి సైకిల్ గుర్తుకే ఓటు వేయాలంటూ ప్రచారం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను టిడిపి నుంచి రాజకీయంలోకి వచ్చానని ప్రజలు మనసును గెలుచుకొని గత ఎన్నికలలో తిరుగులేని విజయం సాధించినట్లు చెప్పారు.కానీ ఈసారి నమ్ముకున్న పార్టీ నాయకులు తనను నిండా ముంచే ప్రయత్నం చేశారని ఆవేదన చెందారు.ఇదిలా ఉండగా ఆమె పోటీ చేస్తున్న నియోజకవర్గంలో తమ సొంత పార్టీ నేతలతోనే గత కొన్నేళ్లుగా వైరం నడుస్తున్నట్లు తెలుస్తుంది.ఆమె మంత్రి హోదాలోని ఈ విషయాన్ని పలుమార్లు స్పష్టం చేసింది. ముందు ఒకలా ఉంటూ వెనక తనకు గోతులు తవ్వుతున్నారు అంటూ విమర్శలు గుప్పించారు. కానీ అదే పార్టీకి చెందినకొందరు నాయకులు రోజా మాటలను పట్టించుకోవడం మానేశారు.తాము చెప్పదలుచుకున్న విషయాన్ని స్పష్టంగా మీడియా ముందుకు వచ్చి చెప్పేవాళ్ళు.దీంతో అక్కడ రోజాకి సొంత పార్టీలోనే శత్రువులు తయారయ్యారు అనేది స్పష్టం అవుతుంది. ఈఎన్నికలలో రోజా గెలుపు అనేది అసాధ్యమని ఆ పార్టీ నేతలే బహిరంగంగా చెబుతున్నారు.అయితే అది నిజమో కాదో తెలుసుకోవాలంటే కౌంటింగ్ వరకు వేచి చూడాల్సిందే.ఇక మాజీ మంత్రి కొడాలి నాని అప్పుడప్పుడు అడపాదడపా ఒకటి రెండు సార్లు టిడిపి నాయకులకు కౌంటర్లు వేయడం జరిగిందే తప్ప పూర్తిస్థాయిలో మాత్రం ఓపెన్ అవ్వలేదు.ఇక పోలింగ్ రోజు కూడా పెద్దగా ఎక్కడ కనిపించలేదు.ఈసారి పోలింగ్ రోజున కొడాలి నాని లేదా తన అనుచరులు పోలింగ్ బూత్ల వద్ద హడావిడి చేస్తారని అటు మీడియా వాళ్ళు ప్రజలు భావించారు.కానీ అనుకున్నట్లుగా పెద్దగా ఏమీ జరగలేదు.మొదటినుంచి వైసిపి గెలుస్తుంది అని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు అని బల్ల గుద్ది మరీ గట్టిగా చెప్పిన కొడాలి నాని తర్వాత ఏమైపోయాడో తెలియదు.చాలాచోట్ల పోలింగ్ రోజున సాయంత్రం వేళలో అధిక శాతం పోలింగ్ నమోదవడం రాజకీయ పార్టీలకు మరింత ఊతం ఇచ్చినట్లు అయింది.ఉదయం పడిన ఓట్లని వైసీపీకి అని సాయంత్రం నుంచి పోల్ అయిన ఓట్లు కూటమికి అని రాజకీయ విశ్లేషకులు వెల్లడించడం జరిగింది. ఈ లెక్కన మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పడిన ఓట్లు శాతం కూటమికి భారీ ఎత్తున ఓట్లు పడినట్లు సమాచారం. ఇక సర్వేలు కూడా కూటమిక అనుకూలంగా రావడంతో చాలామంది వైసిపి నేతలు సైలెంట్ అయ్యారని ప్రచారం జరుగుతుంది.ఈ క్రమంలోనే కొడాలి నాని కూడా సైలెంట్ అయ్యారు అనేది ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు.కౌటింగ్ తర్వాత మరి పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More