రాకింగ్ స్టార్ యశ్ హీరోగా భారీ పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్ ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. అనౌన్స్మెంట్ రోజు నుంచి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఎక్స్‌పెక్టేషన్స్‌ను మించేలా డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ తెరకెక్కించనున్నారు.
పూజా కార్యక్రమాల్లో సంప్రదాయానికి అనుగుణంగా నటుడు, నిర్మాత యశ్, నిర్మాత వెంకట్ కె.నారాయణ, వారి కుటుంబ సభ్యులతో కలిసి సినిమా విజయం సాధించాలని దేవుడి ఆశీస్సులు కోరారు. పూజా కార్యక్రమాల్లో చిత్ర యూనిట్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరై టీమ్‌కి అభినందనలు తెలిపారు.
కెజియఫ్ తర్వాత యశ్ ఎలాంటి సినిమా చేస్తారోనని ఆసక్తిగా ఎదురు చూసిన అభిమానుల నిరీక్షణకు ఈరోజుతో తెరపడింది.
గీతు మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న “టాక్సిక్షను విజువల్ గ్రాండియర్ మూవీగా, ఎమోషనల్, పవర్ఫుల్ కథతో తెరకెక్కించనున్నారు. దీని కోసం స్టార్ యాక్టర్స్, టెక్నికల్ టీమ్ చేతులు కలిపింది.