Vaisaakhi – Pakka Infotainment

అవుట్ కట్స్ లో ‘రేవ్’ట్టేస్తున్నారు…!

బెంగళూరు శివారు లో జరిగిన రేవ్ పార్టీ లో నటి హేమ అరెస్ట్ ఆమెను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(MAA) నుంచి సస్పెండ్ చెయ్యడం తో చాలారోజుల తరువాత రేవ్ పార్టీ మళ్లీ వార్తల్లోకి వచ్చింది.. ఒక్క బెంగళూరే కాదు, మన హైదరాబాద్, ముంబై, చెన్నై ఇలా మెట్రో సిటీ లే కాదు.. చిన్నా చితక నగరాలను కూడా ఈ రేవ్ ఓ రెవెట్టేస్తోంది.. ఇంతకీ అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి..? అదరగొట్టే మ్యూజిక్.. మిరుమిట్లు గొలిపే లైటింగ్.. అంతకు మించి మత్తెక్కిచ్చే డ్రగ్స్.. నైటంతా అది ఇది అన్న తేడా లేకుండా తాగుతూ తూగుతూ ఆ మత్తు లో డాన్స్ చేస్తూ వేరే లోకంలో విహారం చెయ్యడమే రేవ్ పార్టీ.. పబ్స్ ఓల్డై పోయాయి.. సంథింగ్ స్పెషల్ గా పార్టీ కల్చర్ కోరుకునే వారికి హాటెస్ట్ సెంటర్స్ ఇవి రేవ్ పార్టీలో ఎంజాయ్ చేయడమంటే ఒక అడ్వెంచర్.. సిటీ పరిధుల్ని దాటి శివార్లలోని కొన్ని రిసార్ట్లు, ఫామ్ హౌస్ లో అత్యంత గోప్యం గా జరిగే ఈ పార్టీలో దొరికే మజా కోసమే అంతంతదూరం వెళ్ళేది. రేవ్ పార్టీ స్పెషల్ ‘కోక్ అండ్ కూలర్స్’ రేవెల్లర్స్ టెర్మినాలజీ లో కోక్ అంటే ‘కోకైన్’ కూలర్స్ అంటే అమ్మాయిలు.. ఇప్పుడు జరుగుతున్న రేవ్ పార్టీలన్నీ క్లోజ్డ్ సర్క్యూట్ లోనే జరుగుతున్నాయిమందు, డ్రగ్స్ హెవీ మ్యూజిక్ తో పాటు ఓ బిగ్ స్క్రీన్.. ఆ స్క్రీన్ పై ట్రాన్స్ ఇమేజెస్ గా పిలువబడే మానసిక ఉద్రేకాన్ని కలిగించే ఫోటోలు, దృశ్యాలు ప్లే అవుతుంటాయి.. రేవ్ పార్టీకి వచ్చే వారి రేంజ్ బట్టి తీరు బట్టి డ్రెస్ కోడ్ కంపల్సరీ.. మొదట్లో రేవ్ పార్టీ అంటే ఓన్లీ ఎలక్ట్రానిక్ మ్యూజిక్ డాన్స్ పార్టీ మాత్రమే వుండేది.. కానీ ఇప్పుడు రేవ్ పార్టీ బాగా ఎదిగి పోయింది.. ఔటర్ లో జరిగినా.. సిటీ లో జరిగినా రేవ్ పార్టీలు డిఫరెంట్ గానే ఉండాలి అని కోరుకునే వాళ్ళ సంఖ్య రాను రాను ఎక్కువై పోతుంది..నగరంలో మత్తు విష సంస్కృతి క్రమేపీ పుంజుకుంది… ఒకప్పుడు ముంబై, గోవా వంటి లగ్జరీ సిటీలకు పరిమితమైన రేవ్ పార్టీలు ఇప్పుడు దాదాపు అన్ని సిటీల్లోను చిందేస్తున్నాయి. రేవ్ పార్టీ ల్లో కొత్తరకం మారకద్రవ్యమైన మైక్రోలైజ్ సర్కిల్ ఆసిడ్ డైలర్మేడ్ (ఎల్ ఎస్ టి) ఇప్పుడు తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అత్యంత ప్రభావం కలిగిన ఈ డ్రగ్ తక్కువ మోతాదులో వాడితే మూడు గంటల వరకు ప్రభావం ఉంటుంది అదే మైక్రో ఎల్ ఎస్ డి ఓ డాట్ వినియోగిస్తే దాదాపు 20 గంటల పాటు మత్తులోనే జోగుతుంటారని అంచనా.. హైదరాబాద్ లో పోలీసులు ఎన్నో డ్రగ్ ముఠాలకు చెక్ చెప్పి ఎంతోమందిని అరెస్ట్ చేశారు. నైజీరియా, ఉగాండా లకు చెందిన డ్రగ్ పెడ్లర్ లను కూడా అదుపు లోకి తీసుకున్నారు.. స్టూడెంట్ విసాపై ఉగాండా నైజీరియా ల నుంచి ఇక్కడకు వచ్చిన వారే డ్రగ్ కేసుల్లో ఎక్కువ వున్నారు.. రేవ్ పార్టీలు ఇప్పుడు పార్టీ కల్చర్ లో భాగమయ్యాయి ఆ పార్టీల్లోనే థీమ్ ను అనుసరించి డ్రస్సింగ్ చేసుకోవటం నుంచి డ్రగ్స్ వాడటం వరకు అన్ని చేసేస్తున్నారు. పార్టీ సీన్ పూర్తిగా మారిపోయింది. పబ్బులకు వచ్చే రెగ్యులర్ క్రౌడ్ బాగా తగ్గిపోయింది. అన్ని పబ్బుల్లోనూ సిసి కెమెరాలు ఏర్పాటుతో ప్రైవసీ లేకుండా పోవడం తో ఆల్టర్నేటివ్స్ కోసం వెతుకుతూ చాలామంది వీకెండ్స్ ఎంజాయ్ చేస్తుంటే అంతకు మించి ఆనందం కోరుకునే వారు ఫామ్ హౌస్ లోకి వెళ్ళిపోతున్నారు. రేవ్ పార్టీలో డ్రగ్స్ కచ్చితంగా ఉండాలని లేదు కానీ వెస్ట్రన్ ప్రభావం ఎక్కువైన తర్వాత డ్రగ్స్ వాడకం బాగా పెరిగింది అంటున్నారు. నిజానికి 1980 వరకు ప్రపంచంలో ఎక్కడా రేవ్ పార్టీ లేనేలేదు. అమెరికన్ కల్చర్ విస్తరించిన తర్వాత ఇతర పార్టీలు జోరు బాగా పెరిగింది.. నిజానికి రేవ్ పార్టీలన్నీ క్లోజ్డ్ సర్క్యూట్ లోనే జరుగుతున్నాయి వెన్యూ ఒక్కటే కాదు.. ఎవరెవరు అటెండ్ అవుతున్నారు అన్నది కూడా రహస్యమే.. స్నేహితులు అత్యంత సన్నితులు మాత్రమే ఇందులో వుంటున్నారు.. రేవ్ పార్టీల్లో మ్యూజిక్ ఇంపార్టెన్స్ ఎక్కువవ్వడం తో పబ్బుల్లో అది కుదరదు.. సిటీల్లో నో వే.. ఎక్కడైనా చేసుకుందాం అంటే న్యూసెన్స్ కేసులు పోలీసులు హడావిడి అందుకే అందరూ అవుట్స్ కట్స్ కి చలో అంటున్నారు.. గుమ్మనం గా జరిగేవి జరిగిపోతూనే ఉన్నాయి.. అప్పుడప్పుడు ఇలా బయటకు వచ్చేవి వస్తున్నాయి అంతే..

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More