మన కళ్ళ ముందు పాము కనిపిస్తే సడన్ గా ఒళ్ళు జలదరిస్తుంది.అదెక్కడ కాటు వేసి ప్రాణాలు తీస్తుందనిభయంతో అక్కడ్నుంచి పరిగెడతాం.అలాగే కొండ చిలువలు కనిపించిన వాటిక ఆ మాత్రం దూరంగా ఉంటాం.దానికి చిక్కితే ప్రాణాలతో తప్పించుకోవడం అసాధ్యం.కానీ ఓ యువకుడు మాత్రం కొండచిలువకు చిక్కిసుమారుగా ప్రాణాలు పోయే స్థితిలో ధైర్యంతో దానిని ఎదుర్కొని ప్రాణాలతో బయటపడ్డాడు.అప్పటికే అది అతనిని నడుము వరకు మింగేసింది,బతికే ఆశ లేదు కష్టం దానికి ఆహారంగా మారిపోవడం ఖాయం.. కానీఅతని ధైర్యమే అతను ప్రాణాలతో బయటపడేలా చేసింది. ఈ ఘటన అనకాపల్లి జిల్లాకోటవురట్ల మండలంలో చోటుచేసుకుంది.జిల్లాలోని కోటవురుట్ల మండలంలోని గొట్టివాడ గ్రామ పంచాయతీ లోని అణుకు గిరిజన గ్రామానికి చెందిన సింబేరి చిట్టిబాబు, మరో ఇద్దరు స్నేహితులతో కలిసి అటవీ ఉత్పత్తుల కోసం సమీపంలోని అడవికి వెళ్లారు. చెట్టు బెరడు నుంచి వచ్చే తాళ్ల కోసం చిట్టి బాబు ప్రయత్నిస్తున్న సమయం లో వెనకనుంచి వచ్చిన కొండచిలువ ఒకటి దాడి చేసింది. అమాంతం చిట్టిబాబు రెండు కాళ్ళను నోటిలోకి లాగేసుకుని శరీరాన్ని చుట్టుముట్టింది. దీంతో పెద్దగా అరవడంతో అది చూసి భయపడిన అతని స్నేహితులు రాము, శ్రీరామ్ ప్రాణభయంతో అక్కడ నుంచి పారిపోయారు.ఆ సమయంలో పక్కన ఉన్న స్నేహితులు రక్షించాల్సింది పోయి భయపడి పారిపోగా ధైర్యం తెచ్చుకున్న చిట్టిబాబు కొండ చిలువతో పోరాడి ప్రాణాలు దక్కించుకున్నాడు.ఒక వైపు మృత్యు నోట్లో, మరో వైపు పారిపోతున్న స్నేహితులు అదే సమయంలో ధైర్యాన్ని కూడగట్టుకున్న చిట్టిబాబు మనోధైర్యం కోల్పోకుండా తన శక్తిని కూడతీసుకుని కొండచిలువతో పోరాడాడు. అతికష్టం పై దాని నోటినుంచి బయటపడి ఊపిరి పీల్చుకున్నాడు. అక్కడనుంచి కొంత దూరం వచ్చి కేకలు వేయగా సమీపంలో అడవికి వచ్చిన గ్రామస్థుడు నరసింహ రావు సహాయంతో ఊరికి చేరుకున్నాడు.కొండ చిlలువ బారి నుంచి తృటిలో ప్రాణాపాయం తప్పించుకున్నా రహదారి మార్గం లేకపోవడంతోడోలీ లో ఆగమేఘాలపై చిట్టిబాబును గ్రామానికి తీసుకువచ్చారు అక్కడి నుంచి ఆటోలో కోటవురట్ల ఆస్పత్రికి తరలించారు.డాక్టర్లు పరిశీలించి చిట్టి బాబు కు ప్రాణపాయం లేదని చెప్పడంతో కుటుంబ సభ్యులుతో పాటు గ్రామం అంతా ఊపిరి పీల్చుకుంది.
previous post
next post