యంగ్ హీరోలు ప్రిన్స్, నరేష్ అగస్త్య నటించిన సినిమా “కలి”. ఈ చిత్రాన్ని ప్రముఖ కధా రచయిత కె.రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో “రుద్ర క్రియేషన్స్” సంస్థ నిర్మించారు. శివ శేషు దర్శకత్వం వహించారు. లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఈ నెల 4వ తేదీన థియేట్రికల్ రిలీజ్ కు వచ్చి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ రోజు నుంచి ఈటీవీ విన్ లో “కలి” సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
ఆత్మహత్యలతో జీవితంలోని సమస్యలు పరిష్కారం కావనే మంచి సందేశంతో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఎంటర్ టైనింగ్ క్యారెక్టర్స్ తో “కలి” సినిమా రూపొందింది. మన పురాణాల్లోని కలి పాత్రను స్ఫూర్తిగా తీసుకుని హై క్వాలిటీ విజువల్ ఎఫెక్టులతో ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈటీవీ విన్ లో మంచి వ్యూస్ నమోదు చేస్తూ ఈ చిత్రం దూసుకుపోతుంది.
previous post