ఆంధ్రప్రదేశ్లో అప్రకటిత కరెంటు కోతలు కొనసాగుతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలతో పాటు నగర ప్రాంతాలలో కూడా కరెంటు కోతలు తప్పడం లేదు. పగలు రాత్రి అని తేడా లేకుండా ఎప్పటికప్పుడు ముందస్తు సమాచారం లేకుండా ఇష్టాను రీతిగా ఈ కోతలు కొనసాగుతున్నాయి. వైసిపి ఐదేళ్ల పాలనలో చివరి ఏడాదిలో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ప్రతి వేసవిలోనూ కరెంటు కోతలు అనేవి సర్వసాధారణం గా ప్రతి ప్రభుత్వంలో జరుగుతూ వస్తుంది.
అయితే ఫలానా సమయంలో కరెంటు తీయడం జరుగుతుందంటూ ముందస్తు సమాచారం ఇవ్వడం కూడా జరుగుతుంది. కానీ వైసీపీ ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేదు.ఎప్పుడు కరెంటు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. కరెంటు కోతలతో పాటు లోవోల్టేజ్ సమస్య కూడా తొడవడం తో ప్రజలు అవస్థలు పడుతున్నారు.
చిన్నారులు, గర్భిణీలు, వృద్ధుల పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉంది. అసలే వేసవి దీనికి తోడు ఉక్క పూత అనుకుంటే భగభగ మండే ఎండలు అలాగే వడగాల్పులు దీంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు ఇష్టానుసారంగా కరెంటు కోతలు.
రాత్రి వేళలో ఒకటి నుంచి మూడుసార్లు కరెంటు తీయడాన్ని అధికారులు ఏవేవో కారణాలు చెబుతున్నారు. కరెంటు వాడుక అధికమైందని ఈ కారణంగా సమస్య తప్పడం లేదని అంటున్నారు. ప్రజలు మాత్రం ప్రభుత్వ తీరుపై గుర్రుగా ఉన్నారు. ఐదేళ్లలో కరెంటు కోతలు కొనసాగాయి కానీ ఈ ఏడాది మాత్రం అవి మరింత ఎక్కువయ్యాయి. నగర ప్రాంతాలలో గ్రామీణ ప్రాంతాలలో ఇష్టానుసారంగా రాత్రి పగలు అని తేడా లేకుండా కరెంటు కోతలు కొనసాగుతున్నాయి.
previous post
next post