గడచిన ఏడు దశాబ్దాల కాలం లో ఎప్పుడు లేనంత ఉత్సహం గా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరిగింది.. ఉద్యోగ,ఉపాధ్యాయులలో ఎప్పుడూ ఇంతటి ప్రభంజనం నమోదు అవ్వలేదు.. సుమారు ఐదు లక్షల మంది కి పైగా ఓటింగ్ కోసం అప్లయ్ చేసుకుంటే దాదాపు తొంభై శాతానికి పైగా ఓటర్లు అంటే 4,32,222 మంది కి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత ఎన్నికలలో పోల్చుకుంటే ఇది రెట్టింపు 2019 ఎన్నికలలో 2,38,468 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.. ఈ సార్వత్రిక ఎన్నికల్లో మునుపెన్నడూ లేని ఓటింగ్ ఫలితాన్ని ఏకపక్షంగా డిసైడ్ చేసిందన్న టాక్ బలంగా వినపడుతోంది. ఎంత శాతం ఓటింగ్ పొలయిందన్న విషయాన్ని ఎన్నికల కమీషన్ పూర్తి వివరాలను వెల్లడించలేక పోయినప్పటికీ దాదాపు నూరుశాతం ఓటింగ్ జరిగే అవకాశం ఉంటుందని ఉద్యోగవర్గాలు చెపుతున్నాయి.. ఓట్లు వేసే ఫెలిసిటీషన్ సెంటర్లు, ఆర్వో కేంద్రాలు, ఓటర్ల తో కిక్కిరిసిపోయాయి.. 8వ తేదీ నాటికి అనంతపురం అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం లో అత్యధికంగా 5478 ఓట్లు, మంత్రాలయం లో అత్యల్పం గా 702 ఓట్లు నమోదవగా.. శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో అత్యధికంగా 23,574 ఓట్లు నర్సాపురం పార్లమెంట్ పరిధిలో అత్యల్పం గా 13,177 ఓట్లు పడ్డాయి..
తాడికొండ అసెంబ్లీ సెగ్మెంట్ లో అంతకు ముందెన్నడు లేనంతగా ఓటింగ్ జరిగింది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట లో ఉద్యోగులకు ఇవ్వాల్సిన పోస్టల్ బ్యాలెట్ స్థానం లో ఈవీఎం బ్యాలెట్(టెండర్ బ్యాలెట్) ఇవ్వడం అది గుర్తించని ఓటర్లు దానిపైనే ఓటు హక్కు ని వినియోగించుకున్నారు.. ఇక్కడ రీపోలింగ్ నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.. తమ ఓటు ఎక్కడ ఉందో తెలియక ఉద్యోగులు కన్ఫ్యూజ్ అయినా తిరిగి తిరిగి ఫైనల్ గా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇదంతా ప్రభుత్వమార్పుకి సంకేతమని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.. ఉద్యోస్థులంతా బ్రహ్మాండం గా ఈవీఎంలు దద్దరిల్లిపోయేలా ఓట్లు ఏకపక్షంగా వేశారని ఈ నెల13న వారి కుటుంబ సభ్యులతో కూడా ఇలాగే ఓట్లు వేయించాలని అన్నారు.. అలాగే ఎనభై శాతం ఒకే పార్టీ వైపే ఈ ఓటింగ్ ఉందని కొంతమంది ఉద్యోగులు చెప్తున్నారు.. భారీ ఎత్తున నమోదైన ఓట్లు.. టీడీపీ అధినేత వ్యాఖ్యలు.. ఉద్యోగుల మాట..ఒకే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.. జూన్ 4 ఫలితాన్ని పోస్టల్ బ్యాలెట్ లు ఇప్పుడే డిసైడ్ చేసాయన్న వ్యాఖ్యలు గట్టిగానే వినిపిస్తున్నాయి.