ఫలితాలు ఇంకా రాలేదు ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారో క్లారిటీ లేదు.. కానీ వచ్చే కొత్త ప్రభుత్వంలో పలు పోలీస్ స్టేషన్లలో కీలక పోస్టింగుల కోసం పోలీసు అధికారులు రాజకీయ నేతల చుట్టూ ప్రదక్షిణలు మొదలు పెట్టేసారు. ప్రధాన పార్టీలలోని కీలక వ్యక్తులను కలిసి అప్పుడే మంతనాలు కూడా ప్రారంభించారు.ముఖ్యంగా విజయవాడ, విశాఖలో ఈ పరిస్థితి కనిపిస్తుంది. బాగా ఆదాయ మార్గాలు వుండే పోలీస్ స్టేషన్లలో ఎస్సై, సీఐ పోస్టింగ్ ల కోసం కర్చీఫ్లు వేస్తున్నారు.అవసరమైతే ఆ పోస్టింగ్ కోసం ఎంత డబ్భైన ఇచ్చేందుకు వెనకాడటం లేదట. అయితే పలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం టిడిపి, జనసేన, బిజెపి కూటమి గెలుస్తుందని.. మరికొన్ని ఎగ్జిట్ పోల్స్ లో వైసిపి గెలిచే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతుంది.అయితే ఈ ఎన్నికలలో ఉద్యోగస్తులందరూ కూటమివైపే ఉండి ప్రచారం చేశారనే గట్టి వాయిస్ అయితే వినిపిస్తోందిఅందులో పోలీసు శాఖ కూడా ఉంది అందుకే చాలామంది పోలీసు అధికారులు టిడిపి, బిజెపి, జనసేన ముఖ్య నేతలతో కలిసి తమ పోస్టుల కోసం చర్చిస్తున్నారు.ఆంధ్రప్రదేశ్ కు ఎక్కువగా ఆదాయం వస్తున్న విశాఖలో పోస్టింగ్ కోసం చాలా కష్టపడుతున్నారు.ఎక్కువగా టిడిపి ముఖ్య నేతలను కలుస్తూ తమ కోరిన పోలీస్ స్టేషన్లో పోస్టింగ్ ఇవ్వాలంటూ విన్నపాలు చేసుకుంటున్నారు.ఇప్పటికే విజయవాడ, విశాఖలో వైసీపీ ప్రభుత్వంలో ఇలాగే రాజకీయ పోస్టింగులు వచ్చాయి.అందుకే పోలీసు శాఖలో చాలామంది అధికారులు వైసిపి ప్రభుత్వానికి అనుకూలంగా పని చేశారు. అయితే నేడు పరిస్థితుల పూర్తిగా మారిపోవడంతో ఇప్పుడు అధికారులందరూ కూటమి వైపు చూస్తున్నారు.తమకు నచ్చిన చోట పోస్టింగ్ ఇవ్వాలంటూ రిక్వెస్ట్ లు పెడుతున్నారు.