రాష్ట్రం లో అత్యంత కీలకంగా మారిన నియోజకవర్గం పిఠాపురం.. ఎక్కువ డబ్బు వెదజల్లారని.. అందరూ అనుకుంటున్న నియోజకవర్గం.. పెద్దరేంజ్ లో బెట్టింగ్ లు నడుస్తున్న నియోజకవర్గం కూడా ఇదేనని విశ్లేషకుల మాట.. ఇంకా ఫలితాలకు మరికొద్ది రోజులున్నాయి. చాలా సర్వేలు గెలుపు ఎవరిదో చెప్పేశాయి.. ఇరుపార్టీలు గెలుపు ధీమా వ్యక్తం చేస్తూ హల్చల్ చేస్తూనే ఉన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే గా వంగ గీతా విశ్వనాధ్ గెలిస్తే డిప్యూటీ సీఎం ని చేస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన ను ఇప్పుడు వాహనాలపై రాసి స్టికర్ వార్ కి తెరలేపారు.. దీనికి కౌంటర్ గా కొంత మంది జనసేనకు చెందిన వారు తమ బైక్లు, కార్లు, ఆటోలపై ‘మా ఎమ్మెల్యే పవన్’ పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా.. అని రకరకాల క్యాప్షన్స్ తో స్టిక్కర్లు వేయించుకుంటున్నారు. అటు వైసిపి అభిమానులు కూడా తగ్గేదెలే అంటూ ‘డిప్యూటీ సీఎం వంగా గీత’ అంటూ స్టిక్కర్లతో వాహనాలను నింపేస్తున్నారు. జూన్4 ఫలితం ఎం తేల్చనుందో అన్నది పక్కన పెడితే స్టిక్కర్ల సందడి పిఠాపురం ఒక్కటే కాకుండా చుట్టుపక్కల నియోజకవర్గాలలో కూడా రాజుకుంది.. ఎన్నికల ఫలితాలకు ముందే ఇరు పార్టీల నుంచి అభిమానం పీక్స్ కి చేరడంతో మరోసారి పిఠాపురం వార్తల్లో నిలిచినట్లయింది.. అయితే ఈ స్టిక్కర్ల పై పోలీసువర్గాలు ఇంకా స్పందించలేదు.. నంబర్ ప్లేట్ పై ఉన్న వాటిపై మాత్రం చర్యలు తీసుకునే అవకాశం ఉంది.. ఎవరి నమ్మకంతో వాళ్లు స్టిక్కర్లు వేసుకొని చేస్తున్న హడావుడి జూన్ 4 తో తేలిపోనుంది.
previous post