గతంలో టీడీపీకి కంచుకోటగా ఉండే పల్నాటి సీమ మాచర్ల నియోజకవర్గం 2004 నుంచి 2024 వరకు సుమారు 20 సంవత్సరాలు ఇక్కడ టీడీపీ అభ్యర్థి ఓటమి పాలు అవుతూ పిన్నెల్లి కుటుంబికులే ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నారు. 2004లో పిన్నెల్లి లక్ష్మరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. ఆ తరువాత 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా పిన్నెల్లి రామకృష్ణరెడ్డి విజయం సాధించారు. రాజశేఖరరెడ్డి మరణంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన పిన్నెల్లి. రామకృష్ణరెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉపఎన్నికలు వచ్చాయి. ఉపఎన్నికలలో ఆ తరువాత జరిగిన ఎన్నికలలో పిన్నెల్లి కుటుంబికులే మాచర్ల రాజ్యం ఎలుతున్నారు. ఈసారి ఎన్నికలలో మాచర్ల టీడీపీ ఇంచార్జిగా జూలకంటి. బ్రహ్మనందరెడ్డిని చంద్రబాబు నియమించడంతో ఆ పార్టీ కార్యకర్తలలో నూతన ఉత్సాహం వచ్చింది. బ్రహ్మరెడ్డి కుటుంబం కూడా రాజకీయ కుటుంబం కావడంతో కార్యకర్తలు బ్రహ్మరెడ్డి వైపే మొగ్గు చూపారు. బ్రహ్మరెడ్డి తండ్రి స్వర్గీయ జూలకంటి. నాగిరెడ్డి, తల్లి దుర్గంబ లు సైతం ఎమ్మెల్యేలుగా పనిచేయడంతో మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లికి దిటైన అభ్యర్థి బ్రహ్మరెడ్డి అయితే నే ఇక్కడ పార్టీ పుంజుకుంటుంది అన్నా ఉద్దేశంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాచర్ల టీడీపీ ఇంచార్జిగా బ్రహ్మరెడ్డిని నియమించారు. ప్రస్తుతం 2024 ఎన్నికలలో పిన్నెల్లి పై పోటీ చేసి 33,000 ఓట్లు సాధించడం చాలా అరుదైన రికార్డు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మళ్ళీ తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరెడ్డి ద్వారా పూర్వ వైభవం వచ్చిందని పార్టీలోని సీనియర్ నాయకులు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా నాలుగు సార్లు విజయం సాధించిన పిన్నెల్లి కోటను బ్రహ్మరెడ్డి బద్దలు కొట్టారు అనడం అక్షరసత్యం. మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ విజయం సాధించడంతో కార్యకర్తలలో నూతన జోష్ నెలకొంది.
previous post