అతి తక్కువ కాలంలో ఎక్కువ సినిమాలు నిర్మించి టాలీవుడ్ పై తనదైన ముద్ర వేసిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కన్నడ డిస్ట్రిబ్యూషన్ రంగం లోకి అడుగు పెట్టబోతోంది.. కచ్చితత్వానికి, క్వాలిటీ ప్రొడక్ట్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తన బ్రాండ్ విస్తరణలో భాగంగా కే ఆర్ జీ స్టూడియెస్ తో కలసి టీజీ విశ్వ ప్రసాద్ తన విజన్‌తో ఓ బ్రాండ్ క్రియేట్ చేసే దిశ గా అడుగులు వేస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి సినిమా వస్తుందంటే అంచనాలు ఓ స్థాయిలో ఉంటున్నాయి. భారీ బడ్జెట్ చిత్రాలకు టీజీ విశ్వ ప్రసాద్ కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు.
ఓవర్సీస్‌లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి ఉన్న పట్టు గురించి అందరికీ తెలిసిందే.
ఇప్పటి వరకు టాలీవుడ్‌లో సత్తా చాటిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఇకపై శాండిల్ వుడ్‌ను ఏలేందుకు సిద్దమైంది. కన్నడ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి టీజీ విశ్వ ప్రసాద్ అడుగు పెట్టబోతున్నారు. కేఆర్‌జీ స్టూడియోస్‌తో కలిసి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఇకపై అక్కడ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేయనుంది. అక్కడ కూడా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, టీజీ విశ్వ ప్రసాద్ తమదైన ముద్రను వేయనున్నారు.