అవి రెండో ప్రపంచ యుద్ధ రోజులు. ప్రపంచ దేశాలు రెండు గ్రూపులుగా విడిపోయి యుద్ధం సాగిస్తున్న రోజులు. జర్మనీ దాని మిత్రదేశాల కు చెక్ పెట్టేందుకు మిగతా దేశాలన్నీ ఏకమయ్యాయి. ఆ సమయంలో జర్మనీతో పాటు జపాన్ కూడా శత్రుదేశాలపై విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలోనే జపాన్ కు చెందిన యుద్ధ విమానాలు విశాఖ పై బాంబుల తో దాడి చేసాయి. ఈ దాడుల్లో కొంత మేర నష్టంతో పాటు మరికొంత మంది మృతి చెందారు. అయితే అదే సమయంలో విశాఖ తీరంలో భారీ ఆయుధ సామాగ్రితో ఉన్న అమెరికన్ నౌక లపై దాడి జరిగితే విశాఖపట్నం ఇప్పుడిలా మిగిలేది కాదు..మొత్తం భస్మిఫటలమయ్యేది. అసలు అప్పుడు ఏం జరిగింది.ఆనాటి పరిస్థితులు ఎలా ఉన్నాయి. జపాన్ విశాఖపై దాడి చేయడానికి కారణాలేంటి..? విశాఖ నుంచి ఎక్కువగా బర్మా, శ్రీలంకకు వాణిజ్యం జరుగుతుండేది. బ్రిటిష్ కాలంలో వాణిజ్య నగరంగా ఉన్న విశాఖ పై శత్రు దేశాలు దృష్టి సారించాయి. బ్రిటిషర్ల ఆర్థిక మూలాలను దెబ్బకొట్టాలనే ఆలోచనతో రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ ఇక్కడ బాంబుల వర్షం కురిపించింది. పోర్టు, సింధియా షిప్ యార్డు, పవర్ హౌస్, లతో పాటు ఓడరేవులోని స్టీమర్లను టార్గెట్ చేసి జపాన్ బాంబులు వేసింది. అయితే ఆ సమయంలోనే బర్మాలో ఉన్న మిత్ర దళాలకు ఆయుధాలు, బాంబులతో కూడిన సామగ్రితో రెండు నౌకలను అప్పటి అమెరికా ప్రెసిడెంట్ చర్చిల్ పంపించారు. ఈ నౌకలు చిట్టగాంగ్ చేరుకోగానే అప్పటివరకు హిందూ మహాసముద్రం బంగాళాఖాతంలో కాచుకుని ఉన్న జపాన్ నౌకదళం ఆయుధ సామగ్రితో వస్తున్న అమెరికన్ షిప్ లను అనుసరించాయి. జపాన్ సేనల బారి నుంచి తప్పించుకునేందుకు ఈ నౌకలను సిబ్బంది వైజాగ్ పోర్ట్ కి దారి మళ్లించేశారు. ఈ నౌకలపై దాడి చెయ్యాలని జపాన్ విమానాలు వాటిని అనుసరిస్తూ వెళ్తున్నాయి. ఈ క్రమంలోనే జపాన్ యుద్ధ విమాన వాహక నౌక రెండు యుద్ధ విమానాలతో వైజాగ్ పోర్ట్ వైపుగా వస్తున్న నౌకను గుర్తించిన భారత రక్షణ బృందాలు సైరన్ మోగించాయి. ప్రమాదాన్ని పసిగట్టిన సింధియా షిప్ యార్డ్ ( ప్రస్తుతం హిందుస్థాన్ షిప్ యార్డ్ ) సిబ్బంది బ్రిటిషర్లు నిర్మించిన బంకర్లలో ఆశ్రయం పొందారు. ఇదిలా ఉండగా బ్రిటిషర్ల పాలన సమయంలో ఉన్న విశాఖ తీరానికి శత్రుదేశాల నుంచి ముప్పు వాటిల్లే ఆకాశం ఉందని ముందే గ్రహించిన 1938- 41 మధ్యకాలంలో షిప్ యార్డ్ లో 4 భారీ బంకర్లను నిర్మించింది. ఈ బంకర్ల నుంచే తీరం దాటి వచ్చే వచ్చే శత్రుమూకల పై దాడి చేసేవారు. దాడి కి యత్నించిన జపాన్ యుద్ధ విమానాలు వెనక్కి వెళ్ళి అదేరోజు మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో తిరిగి వచ్చి టూ ప్లస్ త్రీ వ్యూహంతో విశాఖ తీరంపై దాడి చేసి రేవులోకి ప్రవేశించేందుకు ప్రయత్నించి. రెండు యుద్ధ విమానాలతో అమెరికన్ నౌకలపై దాడి చేశాయి.అక్కడ ఉన్న నౌకలోని అమెరికన్ సేనలు తమ వద్ద ఉన్న బోఫోర్స్ యాంటీ క్రాఫ్ట్ గన్స్ తో జపాన్ విమానాలపై కాల్పులు జరిపారు. నలువైపులా చుట్టుముట్టి దాడి చేయాలన్న జపాన్ లక్ష్యంగా చేసుకుంది. కానీ మూడు వైపులా కొండలు ఉండటంతో వారి పథకం ఫలించలేదు. దీంతో మరోసారి తిరిగి వెళ్ళిపోయినా మళ్ళీ అదే రోజు సాయంత్రం ఆరు గంటల వరకు అన్ని విధాలుగా ఎటాక్ చెయ్యడానికి జపాన్ ప్రయత్నించినప్పటికి అనుకున్న లక్ష్యాన్ని చేదించలేక వెనుతిరిగి వెళ్ళిపోయాయి. అయితే ఆ దాడి సమయంలో రెండు వేల టన్నుల పేలుడు పదార్థాలతో ఉన్న అమెరికన్ నౌకల పై ఏ ఒక్క బాంబు పడిన విశాఖపట్నం మొత్తం తుడిచిపెట్టుకుపోయేది. అదే జరిగితే వైజాగ్ రెండో పెరల్ హార్బర్ గా చరిత్రలో నిలిచిపోయేది. అయితే బ్రిటిషర్లు సింధియాలో నిర్మించిన ఈ బంకర్లలో ఒక బంకర్ ను హిందుస్థాన్ షిప్ యార్డ్ మ్యూజియంగా మార్చింది. ఆజాదికా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఈ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. 80 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన షిప్ యార్డ్ ప్రస్థానాన్ని ఫోటోలు, పరికరాలతో ఈ మ్యూజియంను తీర్చిదిద్దడం విశేషం.