పిఠాపురం నుంచి బరిలోకి దిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీ ఓట్లతో గెలుపొందడం ఖాయమని అంచనాలు వస్తున్న నేపథ్యంలో కూటమి అధికారంలోకి వస్తే మిగిలిన మంత్రి మండలి కూర్పు సంగతి పక్కన పెడితే జనసేనాని ఏ పదవి చేపట్టబోతున్నారు.. డిప్యూటీ సీఎం ఆ… లేక హోం మంత్రా..? లేక గతంలో లా హోం మరియు ఉప ముఖ్యమంత్రివర్యులు గా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారన్న ప్రచారం గట్టిగా జరుగుతుంది. పిఠాపురం లో వైసిపి అభ్యర్థి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ బిజెపి ,టిడిపి పవన్ గెలుపు కోసం పూర్తిగా సహకరించాయి. ఒకవేళ కూటమి గెలిస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది.పవన్ కళ్యాణ్ సీఎం కావాలని అటు కాపు నేతలు, అభిమానులు అలాగే కుటుంబ సభ్యులు ఆశిస్తున్నప్పటికి కానీ ప్రస్తుత పరిస్థితులు దృష్ట్యా అనుభవజ్ఞులైన రాజకీయ దక్షుడు చంద్రబాబు నాయుడు మాత్రమే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా మరోపక్క వైసీపీ శ్రేణులు కూటమి అభ్యర్థులు అన్నిచోట్ల ఓడిపోవడం ఖాయమని ఈ సారి కూడా వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఈసారి ఎన్నికల మాత్రం హోరా హోరీగా జరిగాయి. ప్రతి నియోజకవర్గంలో నువ్వా నేనా అన్నట్లు ప్రచారంలో జరిగింది .పోటీ కూడా జరిగింది.ఈ ఎన్నికలలో డబ్బును మాత్రం అన్ని పార్టీలు బాగా వెదజల్లేయి.అయితే ఇప్పుడు చర్చంతా పవన్ కళ్యాణ్ వైపే జరుగుతుంది.గత ఎన్నికలలో రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్. ఈసారి కూడా ఓడిపోయే అవకాశాలు ఉన్నాయంటూ వైసీపీ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి.ఈసారి పిఠాపురంలో మహిళా ఓటర్లు ఎక్కువమంది పోలింగ్ బూత్ లకు వచ్చి తమ ఓటును వినియోగించుకున్న తరుణంలో ఈ ఓట్లన్నీ వైసీపీకే పడినట్లు అంచనాలు వేస్తు ప్రచారం చేసుకుంటున్నారు..అక్కడ బలంగా ఉన్న టిడిపి క్యాడర్ పవన్ కళ్యాణ్ ను గెలిపించేందుకు శత విధాలుగా చివరి వరకు ప్రయత్నించింది.ఈసారి పక్కా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి జనసేనాని గెలవడం ఖాయం అని సంకేతాలు వస్తున్నాయి.కూటమి ప్రభుత్వ ఏర్పాటు లో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా, ఉంటారా..? హోమ్ మంత్రిగా ప్రమాణం చేస్తారా..? లేక రెండు బాధ్యతలను తీసుకుంటారా.? అన్న చర్చలు జరగడమే కాకుండా ఆ దిశగా గట్టిగా బెట్టింగ్ లు కూడా జరుగుతున్నాయి.
next post