సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించిన సరుకులతోనే శ్రీవారి లడ్డూలు తయారు చేయాలని టీటీడీ సంకల్పించింది. తిరుపతి బాలాజీ తరువాత అంతటి విశేష ప్రాధాన్యత కల్గిన శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని ఇకపై ఆర్గానిక్ ఉత్పత్తులతోనే తయారు చేసి భక్తులకు పంపిణీ చేయాలని దేవస్థానం బోర్డ్ నిర్ణయించింది. అదే విధంగా అత్యంత ప్రాముఖ్యత కల్గిన అన్నప్రసాదం తయారీకి కూడా ప్రకృతి ఆధారిత వ్యవసాయం ద్వారానే పండించిన దినుసులనే వాడాలని, భక్తులకు మంచి ప్రసాదం అందించాలన్న సంకల్పం తోనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇప్పటికే ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన వస్తువులతో శ్రీవారికి నైవేద్యం నివేదిస్తున్న టీటీడీ కొత్త నిర్ణయాల కోసం రైతు సాధికార సంస్థ ద్వారా12 రకాల వస్తువులను సరసమైన ధరలకు కొనుగోలు చేయాలని ఈ కొనుగోలు ప్రక్రియ పై ప్రత్యేక కమిటీ నియమించనున్నట్టు కూడా తెలిపింది. ఇందుకు అనుగుణంగా మార్కట్ గోడౌన్ పునఃనిర్మాణానికి రూ.18 కోట్లు, కోల్డ్ స్టోరేజ్ పునఃనిర్మాణానికి రూ.14 కోట్లు కేటాయించారు. ఈ వేసవిలో భక్తుల రద్దీకి అనుగుణంగా విస్తృతంగా ఏర్పాట్లు చేసింది టీటీడీ సామాన్యభక్తుల దర్శన కల్పనకే అధిక ప్రాధాన్యత ఇస్తూ సిఫార్సు లేఖలపై విఐపీ బ్రేక్ దర్శనాలు కేటాయింపు కుదించే విధంగా నిర్ణయం తీసుకున్నారు.తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయం పునఃనిర్మాణానికి ఆధునికీకరణకు రూ. 3 కోట్లు అదే విధంగా తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళ వైద్యకళాశాల అభివృద్ధికి రూ.53.62 కోట్లు దేశ రాజధాని ఢిల్లీలోని టీటీడీ ఎస్వీ కళాశాల ఆడిటోరియం ఆధునీకరణకు 4 కోట్లు నిధులు మంజూరు చేసింది బోర్డు.టీటీడీ విద్యాసంస్థల్లో ఉద్యోగాల భర్తీ కూడా ఏపిపిఎస్సీ ద్వారా చేయాలని నిర్ణయం తీసుకున్నారు.ఇప్పటికే 287 కోట్లు టీటీడీ నిధులు ఇచ్చిన తిరుపతి లో నిర్మాణం లో ఉన్న శ్రీనివాససేతు ఫ్లై ఓవర్ కు అవసరమైన నిధులను మంజూరు చేయాలని బోర్డు నిర్ణయం తీసుకుంది