Vaisaakhi – Pakka Infotainment

భూతల అద్భుతం కేదార్‌నాథ్..

ఎప్పుడు నిర్మితమైందో.. ఎవరు నిర్మించారో.. ఖచ్చితంగా చెప్పలేకపోయినప్పటికి దేవతల నుండి..పాండవులు.. ఆదిశంకరాచార్యుల వరకు ఎందరో ఈ ఆలయాన్ని దర్శించి తరించారన్నది మాత్రం నూరుశాతం చెప్పుకోదగ్గదే.. ప్రస్తుతం మనకు కనిపించే ఈ కట్టడం సుమారు 8వ శతాబ్దంలో నిర్మించబడిందని తెలుస్తోంది.. అత్యంత ప్రతికూల వాతావరణం లో నిర్మితమైన ఈ ఆలయం దాదాపు పన్నెండు వందల సంవత్సరాల నుండి సురక్షితంగా పూజలందుకుంటుంది? ఓ వైపు ఇరవై రెండు అడుగుల ఎత్తులో కేదార్‌నాథ్ శిఖరం మరోవైపు ఇరవై ఆరు వేల అడుగుల ఎత్తులో కరచ్‌కుండ్ ఇంకో వైపు ఇరవై ఏడు వేల అడుగుల ఎత్తులో భరత్‌కుండ్ ఈ మూడు పర్వతాల గుండా ప్రవహించే మందాకిని, మధుగంగ, చిర్గంగ, సరస్వతి స్వరందరి. ఆరు నదులు ఇక్కడి నుంచే ప్రవహిస్తాయని పండితులు చెప్తుంటారు.. పురాణాలలో ప్రస్తావించినట్టుగా “మందాకినీ నది” ఆవిర్భావ ప్రాంతంఇదే. విపరీతమైన మంచు.. వర్షాకాలంలో అతి వేగంతో ప్రవహించే నీరు.. ఇలాంటి అత్యంత ప్రతికూల ప్రాంతంలో ఇలాంటి ఆలయం… ఈ భూతలం పై మనకు కనిపించే ఓ అద్భుతం.. వాహనాలు చేరలేని ఈ ప్రాంతంలో “ఐస్ ఏజ్” కాలంనాటి వాతావరణంగా శాస్త్రవేత్తలు భావించే ఈ టైంలో దాదాపు పన్నెండు వందల సంవత్సరాల క్రితం ఇలాంటి ఆలాయాన్ని ఎలా నిర్మించారు. డెహ్రాడూన్‌లోని “వాడియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జియాలజీ,” వారు కేదార్‌నాథ్ దేవాలయంలోని రాళ్లపై నిర్వహించిన లిగ్నోమాటిక్ డేటింగ్ పరీక్షలో 14వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం మధ్యకాలం వరకు ఆలయం పూర్తిగా మంచుతో కప్పబడి ఉందని అయినప్పటికీ కట్టడానికి ఎలాంటి నష్టం జరగలేదని తేలడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేసింది.. పన్నెండు వందల సంవత్సరాల తరువాత, ఆ ప్రాంతంలోనికి బయటి నుండి తరలించబడిన ప్రతిదీ తుడుచుకుపెట్టుకు పోయింది, ఒక్క నిర్మాణం కూడా నిలబడలేదు అయితే ఈ ఆలయం మాత్రం చెక్కుచెదరకుండా ఉండడం విశేషం. ఆలయ నిర్మాణానికి వినియోగించిన రాయి ఆ ప్రాంతంలో లభించేది కాదు.. కనీస రవాణా సదుపాయం లేని ఇక్కడికి ఇంత పెద్ద రాయిని ఎలా తరలించారన్నది ఓ పెద్ద ఫజిల్ కాగా దాదాపు నాలుగు వందల సంవత్సరాలు మంచు కింద కప్పబడి ఉన్నప్పటికీ ఆ రాతి క్వాలిటీ లో ఎటువంటి తేడా రాకపోవడం గమనార్హం.. అనేక ప్రకృతి విపత్తులలో తన బలాన్ని నిలుపుకున్న ఈ బలమైన శిలలను ఎలాంటి సిమెంట్ లాంటి పదార్ధం ఉపయోగించకుండా “ఆష్లర్” పద్ధతిలో అతికించారు. దీని కారణంగా రాతిపై ఉష్ణోగ్రత మార్పుల ప్రభావం లేకుండా ఆలయ బలం అభేద్యంగా నిలిచి పోయింది.. 2013లో కేదార్‌నాథ్‌ను తాకిన విపత్కర వరదల సమయంలో సగటు కంటే 375% ఎక్కువ వర్షపాతం నమోదైంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం 5748 మంది మరణించగా సమీప ప్రాంతాల్లోని 4200 గ్రామాల్లో కొన్ని పూర్తిగా మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి. భారత వైమానిక దళం ద్వారా లక్షలాది మంది సురక్షిత స్థావరాలకు తరలివెళ్లారు అంతా అతలాకుతలం అయిన ఇంత విపత్కర వరదల ప్రభావం కేదార్‌నాథ్ ఆలయ నిర్మాణంపై ఏ మాత్రం పడకపోవడం అద్భుతం కాక మాటేమిటి..?ఆర్కియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా పరిశోధనల ప్రకారం, వరదల తర్వాత కూడా ఆలయం మొత్తం నిర్మాణం యొక్క ఆడిట్‌లో 99 శాతం పూర్తిగా సురక్షితంగా ఉందని తేలింది. అలాగే వరదల సమయంలో పరిస్థితిని.., ప్రస్తుత స్థితిని అధ్యయనం చేయడానికి ఐ ఐ టీ మద్రాస్ కూడా ఆలయంపై ఎన్ డీ టీ పరీక్ష నిర్వహించింది. అందులో కూడా ఆలయం పూర్తిగా సురక్షితంగా, పటిష్టంగా ఉందని కూడా తేలింది. రెండు వేర్వేరు సంస్థలు నిర్వహించే “శాస్త్రీయ పరిశీలన మరియు శాస్త్రీయ పరీక్ష”లో సైతం ఆలయ పటిష్టత నిరూపించుకుంది.. ఆలయం ఇలా ఉండటానికి నిర్మించిన విధానమే అని విశ్వసిస్తున్నారు.. కేదార్‌నాథ్ ఆలయాన్ని “ఉత్తర-దక్షిణ”గా నిర్మించారు. భారతదేశంలోని దాదాపు అన్ని దేవాలయాలు “తూర్పు-పశ్చిమ” దిశలో ఉంటాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆలయం “తూర్పు-పశ్చిమం” గా ఉంటే, అది ఇప్పటికే ధ్వంసమై ఉండేది. లేదంటే కనీసం 2013లో వచ్చిన వరదలోనైనా శిథిలమై ఉండేది. కానీ ఉత్తర దక్షిణ నిర్మాణం కారణంగా కేదార్‌నాథ్ ఆలయం బయటపడిందని కొందరంటుంటారు..2013 వరదల్లో వీట ఘలై గుండా గుడి వెనుక భాగంలో ఒక పెద్ద బండ రాయి (భీమా శిల) కూరుకుపోయి నీటి అంచుని విభజించి ఆలయానికి ఇరువైపులా ఉన్న నీరు దానితో పాటు అన్నింటిని మోసుకెళ్లింది కానీ, ఆలయాన్ని అందులో ఆశ్రయం పొందిన ప్రజలను సురక్షితంగా ఉంచింది. మహత్యాన్ని నమ్మినా నమ్మకపోయినా పన్నెండు వందల ఏళ్ళ క్రితమే ఇక్కడి వాతావరణ స్థితిగతులను వరద ఉధృతి దిశను అంచనా వేసి నిర్మించిన నిపుణులను అభినందించకుండా ఉండలేం.. కొన్ని నెలలు వర్షంలో, మరి కొన్ని నెలలు మంచులో, చాలా సంవత్సరాలు మంచులో పూర్తిగా కూరుకుపోయి ఉండి కూడా, సముద్ర మట్టానికి పన్నెండు వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ కట్టడం వెనుకున్న అపారమైన సైన్స్ గురించి ఆలోచిస్తే ఆశ్చర్యపోవడం మాన వంతు…

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More