పొగాకు వ్యతిరేక దినోత్సవం రోజున కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సెన్సార్ చేసుకున్న సినిమాల ముందు వేస్తున్న నో స్మోకింగ్ అడ్వర్టైజ్మెంట్ ఇప్పుడు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ (ott)ల్లో కచ్చితంగా ప్రసారం చేయాల్సిందేనని ప్రకటించింది.. పొగాకు వ్యతిరేక హెచ్చరికలను తప్పనిసరి చేస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ విధించిన నిబంధనలను పాటించడంలో ott యాజమాన్యాలు విఫలమైతే కఠిన చర్యలు తీసుకొనున్నట్లు వెల్లడించాయి.. కరోన తరువాత అనూహ్యంగా పుంజుకున్న ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ ల వ్యువర్స్ కూడా అంతే గణనీయంగా పెరిగారు.. అరచేతిలో వినోదాన్ని తీసుకువచ్చిన ఈ మాధ్యమానికి భారతీయులు బాగా అలవాటు పడిన నేపథ్యంలో కంటెంట్ కూడా అంతే హద్దులు చేరిపేసింది.. ప్రపంచంలో ఉన్న అన్ని రకాల భాషల సినిమాలు చూస్తున్న ప్రేక్షకులు మనదేశానికి చెందిన కంటెంట్ లోను విదేశీ తరహా బోల్డ్ క్రియేటివిటీ.., అశ్లీల సంభాషణలు చెప్పించడం సర్వసాధారణం అయిన తరుణంలో ఓటీటీ కి కూడా సెన్సారింగ్ విధానం ఉండాలని అన్ని వర్గాల నుంచి వస్తున్న డిమాండ్ ఉన్న సమయంలో ఓటీటీ ని నియంత్రణ పై చర్య ఉంటుందని అందరూ భావించారు.. అయితే కేంద్ర ప్రభుత్వం కేవలం స్మోకింగ్ యాడ్ మాత్రం కంపల్సరీ చేసి చేతులు దులిపేసుకుందని వ్యాఖ్యానిస్తున్నారు.. ఇండియా లో అత్యధిక శాతం చూస్తున్న అడ్వర్టైజ్మెంట్ ఏదైనా ఉందంటే అది పొగాకు వ్యతిరేక ప్రకటన మాత్రమేనని అయినప్పటికీ పొగాకు ఉత్పత్తుల అమ్మకాలు విపరీతంగా జరుగుతున్నాయని ఓటీటీ పై కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల కొత్తగా ఒరిగేది ఉండదని అంటున్నారు.. ప్రతి ఇంట్లోకి చోచ్చుకువచ్చిన ఓటీటీ కంటెంట్ నియంత్రణ పై కచ్చితంగా నిర్ణయం తీసుకుని విచ్చలవిడి క్రియేటివిటీ కి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
previous post
next post