కరోన మహమ్మారి విలయతాండవం చేసి లక్షలాది ప్రాణాలను బలిగొంది. మొత్తం ప్రపంచం కరోన దాటికి విలవిలలాడిపోయింది. ప్రపంచ యుద్ధం వచ్చిన అంతమంది మృతి చెందే అవకాశం ఉండదు కానీ కరోన వయసుతో నిమిత్తం లేకుండా చాలామందిని తుడిచి పెట్టేసింది. వ్యాక్సిన్లు కనుగొన్న తర్వాత మరణాల సంఖ్య తగ్గుతూ వచ్చింది. పరిస్థితి కుదుట పడింది. అయినప్పటికీ అక్కడక్కడ కరోన కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ప్రపంచానికి మరో ముప్పు వచ్చి పడింది. గుర్తు తెలియని వైరస్ మనిషి ప్రాణాలను గంటల వ్యవధిలోనే హరిస్తుంది.ఈ వైరస్ సోకిన వాళ్ళు ముక్కు నుంచి రక్తం కారుతూ కొన్ని గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ వ్యాధి ఇతర ప్రపంచ దేశాలపై ప్రభావం చూపిస్తుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరించింది.. అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆఫ్రికా దేశం బురుండిలోని బజిరో అనే ఓ చిన్న పట్టణంలో ఈ కొత్త రకం వైరస్ వెలుగు చూసింది. ఈ వైరస్ కారణంగా 24 గంటల వ్యవధిలోనే ముగ్గురు మరణించారు. ఈ వైరస్ బారినపడిన వారిలో జ్వరం, తలనొప్పి, కళ్లు తిరగడం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. బురుండి లో ఈ వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది. ఆసుపత్రిలో చేరుతున్న రోగుల సంఖ్య పెరుగుతోంది. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గుర్తు తెలియని వైరస్ కారణంగా ముక్కు నుంచి రక్తం కారుతూ కొన్ని గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోతూ ఉండటంతో స్థానికులు మరింత భయానికి లోనవుతున్నారు. కొన్నేళ్ల క్రితం ఎబోలా వైరస్ ఆఫ్రికా దేశంలో మారణ హోమం సృష్టించగా తాజాగా మరో వైరస్ పుట్టుకురావడంతో అక్కడి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోని వైద్య అధికారులు అప్రమత్తయ్యారు. వైరస్‌ను అరికట్టేందుకు చర్యలు ప్రారంభించారు. ప్రజంతా ఇళ్లలోనే ఉండి క్వారంటైన్ పాటించాలని కోరారు. ఈ వ్యాధి త్వరగా ప్రాణాలు తీస్తోందని అక్కడి వైద్యులు చెప్పారు. ఆసుపత్రికి చేరుకునే 24 గంటలలోపే ముగ్గురు రోగులు ముక్కు నుంచి రక్తం కారడంతో మరణించారని వెల్లడించారు. సాధ్యమైనంత తొందరగా.. ఎపిడిమిక్‌గా ప్రకటిస్తే వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని చెప్పారు. ఈ వైరస్ బారినపడి ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని అంటున్నారు. బాధితుల నుంచి శ్యాంపిల్స్ సేకరించి ల్యాబ్‌లకు పంపిస్తున్నామని చెప్పారు. ఇక్కడ నెలకొన్న ప్రమాదకర పరిస్థితులపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సునిసితంగా గమనిస్తుంది.ఈ వైరస్ మరింత వ్యాప్తి చెందితే ప్రపంచ దేశాలకు ముప్పుగా వాటిల్లే అవకాశం ఉందని హెచ్చరిస్తుంది.
previous post
next post