ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువు తీరనున్న నేపద్యంలో చాలామంది అధికార, అనధికార, మాజీ నేతలను ఒక రెడ్ బుక్ టెన్షన్ పెడుతోంది.. అసలు అందులో ఏముంది ఎవరెవరి పేర్లున్నాయి..? అన్నది ఎవరికి తెలియనప్పటికీ ఎవరి మటుకు వారే మూట ముల్లు సర్దుకుని సైడైపోడానికి చూస్తున్నారు..
వైసీపీ పాలన లో కొంత మంది గీత దాటి మరీ వ్యవహరించిన అధికారులకు గొంతు లో తడి ఆరిపోతున్నట్లు సమాచారం. ఇప్పుడు గుంటూరు లో రెడ్ బుక్ హోర్డింగ్ లు కూడా ఏర్పాటు అవ్వడంతో కలకలం మరింత పెరిగింది..
తెలుగుదేశం పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెట్టడంతో పాటు అక్రమ అరెస్టులు చేసి ఆస్తులను ధ్వంసం చేసిన వారిని వారికి సహకరించిన వారిని ఎవ్వరిని వదిలి పెట్టేది లేదని అందరి పేర్లూ రెడ్ బుక్‌లో నోట్ చేసుకున్నానని నారా లోకేష్ హెచ్చరిస్తూ వస్తున్నారు. నారా లోకేష్ ప్రకటన పై సీఐడీ అధికారులు మరింత అత్యుత్సాహం తో నారా లోకేష్ కి నోటీసులు ఇచ్చి తమను బెదిరిస్తున్నారాని పేర్కొంటు
సీఐడీ అధికారులు కోర్టులో కూడా పిటిషన్ వేశారు. ఇదే మాటని చంద్రబాబు బెయిల్ రద్దు వాదనల సమయంలో సుప్రీంకోర్టులోనూ వినిపించారు. మరికొన్ని రోజుల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కొలువు తీరబోతున్న సమయంలో ప్రభుత్వానికి సంభంధం లేకుండా అన్న క్యాంటీన్ల నిర్వహణ, రెడ్ బుక్ అమలు కార్యాచరణ రెండు నారా లోకేష్ టీమ్ ప్రతిష్టాత్మకంగా తీసుకుందని టీడీపీ నాయకులే అంటున్నారు.. తప్పు చేసిన ఏ ఒక్కర్నీ వదిలే ప్రసక్తే లేదని చెప్తున్నారు..
ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించిన తర్వాత నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ కక్ష సాధింపు చర్యలు తమ ప్రభుత్వంలో ఉండవని చెప్తున్నప్పుడే రెడ్ బుక్ ను అమలు చేయరా అన్న మీడియా ప్రశ్నికు కక్ష సాధింపులు ఉండవని చెప్పాను కానీ..తప్పు చేసిన వారిని వదులుతానని చెప్పలేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం లో తప్పులు చేసిన వారందరి పేర్లు తన రెడ్ బుక్‌లో ఉన్నాయని వారిపై చర్యలు తీసుకుంటానని ప్రజలకు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. చాలా మంది అధికారులు సెలవుపై వెళ్ళడానికి, ఆరోగ్యం బాగాలేదని వెళ్ళడానికి చేసిన ప్రయత్నాలను తిప్పికోట్టి సెలవు ని తిరస్కరించారు.. సిట్ కార్యాలయానికి సీజ్ చేసి ఇక్కడ నుండి ఒక్క ఫైల్ కూడా కదలదానికి వీలు లేదని హుకుం జారీ చేసారు.. అలాగే అన్ని డిపార్ట్మెంట్లను అలెర్ట్ చేశారు..
కొంత మంది అధికారుల్ని కలిసేందుకు చంద్రబాబు నిరాసక్తత వ్యక్తం చేశారు.
తాము ప్రతిపక్షంలో ఉండగా కొంత మంది అధికారులు వ్యవహరించిన తీరు.. తప్పుడు కేసులు పెట్టి వేధించిన వైనంపై టీడీపీ అగ్రనాయకత్వంలో చాలా ఆగ్రహం ఉంది.. టీడీపీ గెలిచిన తర్వాత పలువురు అదికారులు చంద్రబాబును కలిసేందుకు ఉండవల్లిలోని నివాసానికి వస్తున్నారు. అయితే అందరికీ చాన్స్ ఇవ్వడం లేదు. చీఫ్ సెక్రటరిగా ఉన్న జవహర్ రెడ్డికి కేవలం బోకే ఇచ్చే అవకాశం మాత్రమే కల్పించారు. ఆయన తీరుపై చంద్రబాబు ఆగ్రహం ఉన్నారు. పైగా జవహర్ రెడ్డిపై అనేక ఆరోపణలు ఉన్నాయి.దీంతో ఆయనను సెలవుపై పంపేశారు. అలాగే సీఐడీ చీప్ గా ఉన్న ఐపీఎస్ అధికారి సంజయ్ కూడా చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించారు. లీవు పెట్టి అమెరికా వెళ్లాలనుకున్న ఆయన ప్రయత్నాలను నిలువరించారు. దీంతో ఆయన చంద్రబాబును కలిసేందుకు వెళ్లారు. కానీ ఆయనను చంద్రబాబు ఇంట్లోకి కూడా వెళ్లనీయలేదు. అలాగే ఇంటలిజెన్స్ చీఫ్ పీఎస్సాఆర్ సీతారామాంజనేలు, సీనియర్ ఐపీఎస్.. చంద్రబాబును కర్నూలులో అరెస్టు చేసిన కొల్లి రఘురామిరెడ్డి కూడా కలిసేందుకు ప్రయత్నించారు. వారెవరికీ అనుమతి లభించలేదు. ప్రమాణ స్వీకార ఏర్పాట్లు చేస్తామని కలిసేందుకు ప్రయత్నించిన గుంటూరు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డిని కూడా దూరం పెట్టారు . ఆయనను కలిసేందుకు కూడా చంద్రబాబు ఆసక్తి చూపించలేదు. వీరంతా రెడ్ బుక్ లో ఉన్నారని చంద్రబాబు పై పెట్టిన స్కిల్ కేసు సహా అన్నీ తప్పుడు కేసులేనని .. తప్పుడు కేసులు పెడుతున్న సీఐడీ అధికారుల్ని వదిలేది లేదని అప్పుడే హెచ్చరించారు. సీఐడీ చీఫ్ గా పనిచేసిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లు లలో ఒకరు పీవీ సునీల్ కుమార్ కాగా.. మరొరకరు సంజయ్. వీరిద్దరిపై కూడా టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు వీరితో పాటు మరికొంతమంది పోలీసు అధికారులు కూడా టీడీపీ హిట్ లిస్ట్ లో వున్నారు. డిప్యూటేషన్ మీద ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ కీలక పదవులు వెలగబెట్టిన అధికారులు రిలీవ్ చేయకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది… అయితే ప్రభుత్వం ఎవర్నీ కదలనీయకుండా చేసింది.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం అనంతరం… కీలకమైన విచారణలు, దర్యాప్తులు ఉండే అవకాశం ఉంది. ఎంతో మంది అధికారులు జైలుకెళ్లే అవకాశం ఉందని టీడీపీ నేతలు అంటున్నారు. అలాగే ముందునుంచి కార్యకర్తల బాగోగులపై ఎక్కువ శ్రద్ధ చూపించే నారా లోకేష్ వారి నుంచి మరింత సమాచారం తీసుకోబోతున్నారని వారు చెప్పే విషయాలను కూడా రెడ్ బుక్ లో యాడ్ చేస్తారని టీడీపీ నేతలు చెప్తున్నారు.. రాష్ట్రంలో ఇప్పుడు చాలామంది బ్యూరోక్రాట్ల గుండెల్లో రెడ్ బుక్ ఎక్స్ప్రెస్ పరుగులు తీస్తోంది
previous post