తన అన్న పై గాని తన తమ్ముడి పైగానీ ఈగ కూడా వాలనివ్వని మెగా తమ్ముడు నాగబాబు తన తండ్రి వర్ధంతి సందర్భంగా ఒక ఎమోషనల్ పోస్ట్ విడుదల చేసారు.. ఒక సాధారణ ఎక్సైజ్ పోలీసు గా లైఫ్ ని గడిపి తనయులు అత్యున్నత స్థానాల్లో నిలిపిన ఆయన శ్రమ ను గుర్తు చేసుకుంటూ నాగబాబు పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.. 2007 డిసెంబర్25 న కన్నుమూసిన ఆయన చిరంజీవి సిన్మాల్ల్లోకి రాకముందే జగత్ కిలాడీలు అనే చిత్రం లో నటించిన విషయం అతికొద్దిమందికె తెలుసు.. తదనంతరం చిరంజీవి తెలుగు చలన చిత్ర పరిశ్రమ పై తనదైన ముద్ర వేసిన విషయం ఆయనకు ఇచ్చిన అమిత ఆనందం.. ఆయన లో ఉన్న నటనాశక్తి తో తరువాత చిరంజీవి తో స్క్రీన్ షేర్ చేసుకోక పోయిన తన వియ్యంకుడు అల్లు రామలింగయ్య నిర్మించిన ‘మంత్రిగారి వియ్యంకుడు’చిత్రం లో ఓ పాత్ర లో నటించారు.. మెగా బ్రదర్ నాగబాబు తన తండ్రి కోసం పెట్టిన పోస్ట్ పూర్తి సారాంశం…. ” …తన రెక్కలు ముక్కలు చేసి రేయి పగలు కష్టపడి పిల్లలు భవిష్యత్తును తన భవిష్యత్తుగా చూసుకుంటూ ఒక అందమైన బాధ్యతలు నెత్తిన పెట్టుకొని మోసే వాడే నాన్న… నాన్న అంటేనే ఒక ధైర్యం…. నాన్న అంటేనే ఒక భరోసా… నాన్న అంటేనే మనం యుద్ధాన్ని చేయడానికి తనను కవచంగా మార్చుకొని మన యుద్ధానికి అందించే కొండంత బలం… నాన్న అనే వాడు మనం జీవితంలో పెరిగి పెద్దవాడవడానికి మనకి ఒక వృక్షం లాంటివాడు.. నాన్న ఆనే వాడు పరిపూర్ణమైన ఒక ప్రేమ.. నాన్న అనే వాడు ఒక అత్యంత కటినమైన క్రమశిక్షణతో కూడిన పాఠాలను నేర్పించే ఒక గురువు… హనుమంతుడు శక్తిని ఎవరో గుర్తు చేస్తే కానీ తెలియదు అన్నట్లు మన శక్తి ఎప్పుడూ పక్కన ఉండి గుర్తు చేస్తూ నువ్వు చేయగలవు… నీకు నేనున్నాను.. అనే ధైర్యాన్ని నింపే శ్రీరాముడు నాన్న.. నాన్న అనే వాడు మన కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు మన గుండెల్లో తన గుండెల్లో మనల్ని హత్తుకొని ఓదార్చే ఒక ఓదార్పు… నాన్న పైవన్నీ మాకు నువ్వు ఇచ్చావు ఈరోజు మేము ఇలా బ్రతుకుతున్నాము.. ఇంత మందితో పోరాడుతున్నాము.. ఇంత మంది మమ్మల్ని అభిమానిస్తున్నారు అంటే దానికి ఏకైక కారణం నువ్వు మమ్మల్ని పెంచిన విధానం మరియు మాపై చూపించిన ప్రేమ.. ఆ ప్రేమను నలుగురికి పంచడానికి చూపించిన దారి సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలి అని నేర్పించిన విధానం.. నువ్వు ఇచ్చిన శక్తి మూలంగానే ఈరోజు మేము ఇక్కడ ఇలా ఉన్నాం థాంక్యూ నాన్న మాకు ఈ జన్మకు నాన్నయ్యావు మా మరో జన్మలో నీకు నాన్న ఈ నీ రుణం తీసుకునే అవకాశం కలగాలని ప్రార్థిస్తూ..” అంటూ తండ్రి పై ఉన్న అమితమైన ప్రేమ ని , గౌరవాన్ని, భక్తి ని చాటుకున్నారు..
previous post
next post