విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా పోటీ చేస్తున్న బొత్స సత్యనారాయణ మండలి లో ప్రవేశానికి అల్మోస్ట్ లైన్ క్లియర్ అయింది.. వైఎస్ఆర్ సీపీ కి రాజీనామా చేసిన తరువాత ఎమ్మెల్సీ పదవి కి కూడా వంశీకృష్ణ శ్రీనివాస్ రాజీనామా చేయడం తో అనివార్యమైన ఈ ఉప ఎన్నికలో పోటీ నుంచి టీడీపీ దాదాపుగా తప్పుకుంది. వైసీపీకి మెజార్టీ MPTC, ZPTCల మద్దతు ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆ పార్టీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఎన్నిక లాంఛనమే. స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ ఉపసంహరించుకుంటే ఎన్నిక ఏకగ్రీవం కానుంది. మొత్తం 838 ఓట్లలో వైసీపీకి దాదాపు 530 ఓట్ల బలం ఉంది ఉమ్మడి విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానం ఉపఎన్నికకు కూటమి దూరంగా ఉండనుంది. గెలవాలంటే పెద్ద కష్టం కాదని.. హుందా రాజకీయాలు చేద్దామన్న ఉద్ధేశ్యం తోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు పార్టీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో స్పష్టం చేశారు. చంద్రబాబు నిర్ణయానికి తెదేపా, కూటమి నేతలు ఆమోదం తెలిపారు. సీఎం అత్యంత హుందాగా వ్యవహరించారన్నారు. ఉప ఎన్నిక నామినేషన్ల దాఖలుకు నేటితో గడువు ముగుస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు తన నిర్ణయాన్ని పార్టీ నేతలకు తెలిపారు.
previous post