చత్తీస్ ఘడ్ లో మావోయిస్టు దళములో కీలక బాధ్యతలు వహించి కొన్నేళ్లుగా అజ్ఞాతంలో ఉన్న ఆరుగురు మావోయిస్టులు డిప్యూటీ ఇన్స్ పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విశాల్ గున్ని,సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ తుహిన్ సిన్హా ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయారు. వీరందరూ పలు నేరాలలో కీలక బాధ్యతలు నిర్వహించారు.అలాగే వీరిపై లక్షలలో రివార్డులు ఉన్నాయి.. లొంగిపోయిన వారిలో కుహరం మిథిలేష్ అలియాస్ రాజుడివిజనల్ కమిటీ సభ్యుడు , కిస్టారం ఏరియా కమిటీ సెక్రెటరీ,బరసి మాసా ఏరియా కమిటీ సభ్యుడు. వెట్టి భీమా కొంట ఏరియా కమిటీ సభ్యుడు ,వంజమ్ రామే అలియాస్ జనతన సర్కార్ కిస్టారం ఏరియా కమిటీ సభ్యురాలు ఈ ఆరుగురునిషేధిత (సిపిఐ ) మావోయిస్టు దళానికి ఆరుగురు కీలక వ్యక్తులు. విశాఖ రేంజ్డిప్యూటీ ఇన్స్ పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వారి కార్యాలయంలో సౌత్ బస్తర్ డివిజన్ ( ఎస్ బి టి డి వి సి) దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ( డి కె ఎస్ జెడ్ ఓ ఓ ) ప్రాంతంలో పని చేస్తున్న ఈ ఆరుగురు అజ్ఞాత మావోయిస్టులు.
previous post