మంచు ఫ్యామిలీలో పొలిటికల్ ఫైట్ తప్పట్లేదు. అన్న మంచి విష్ణు ఏమో వైసీపీ, తమ్ముడు మంచి మనోజ్ ఏమో టిడిపి. వచ్చే ఎన్నికలలో నేరుగా ఆ పార్టీలకు మద్దతు ఇచ్చేందుకు రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం. ఇటీవల టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును మంచు మనోజ్ భార్యతో సహా కలిసి వెళ్లిన తర్వాత ఈ పుకార్లకు మరింత బీజం పడింది. వచ్చే ఎన్నికలలో మంచు మనోజ్ భార్య మౌనిక టిడిపి నుంచి ఎమ్మెల్యే గా పోటీ చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం కూడా జోరందుకుంది. చంద్రబాబు నాయుడు ఆశీస్సులు తీసుకోవడానికి ఆయన వద్దకు వెళ్ళామని మనోజ్ దంపతులు చెబుతున్నప్పటికీ దీని వెనక పొలిటికల్ వ్యూహం ఉందన్న ప్రచారం జరుగుతుంది. మరి పక్క అతను సోదరుడు మంచి విష్ణు భార్య విరనికా రెడ్డి వైఎస్ కుటుంబం నుంచి రావడంతో మంచు విష్ణు పూర్తిగా వైసిపికి సపోర్ట్ చేస్తున్నాడు.
అతని తండ్రి సీనియర్ నటుడు మోహన్ బాబు కూడా గత ఎన్నికలలో వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఆస్తులు విషయంలో ఆ ఇంట్లో ఇటీవల గొడవలు జరిగి మనోజ్ – విష్ణుల మధ్య దూరం పెరగడానికి కారణమైందనే ప్రచారం కూడా సాగింది. మా మధ్య ఈ విషయంలో దీనికి సంబంధించి వారి కుటుంబ సభ్యుల నుంచి కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో రిలీజ్ అయ్యాయి. తర్వాత అదంతా ఫేక్ అని ఒక సినిమా ప్రచారంలో భాగంగా ఈ వీడియోలు చేసినట్లు ఆ కుటుంబం ప్రకటించింది. అయితే తిరుపతిలో ఉన్న ఆస్తులను విష్ణుకు, హైదరాబాదులో ఉన్న ఆస్తులను మనోజ్ కు ఇచ్చారనే ప్రచారం కూడా ఉంది. మనోజ్ పెళ్లి తర్వాత ఆ ఇంట్లో ఆస్తుల కోసం గొడవలు ఎక్కువైనట్లు తెలుస్తుంది. మంచు విష్ణు భార్యకు వైసిపి పార్టీ బ్యాగ్రౌండ్ ఉంది. మంచు మనోజ్ భార్యకు టిడిపి బ్యాక్ గ్రౌండ్ ఉంది. ఒకే ఇంట్లో రెండు పార్టీలు ఇప్పుడు ఉన్నాయి. అయితే దూర దృష్టితోనే మంచు మనోజ్ ను చంద్రబాబు నాయుడు వద్దకు మోహన్ బాబు పంపించాడని తెలుస్తుంది. మంచు మనోజ్ భార్య మౌనిక సోదరి భూమా అఖిలప్రియ 2014లో టిడిపి తరఫున ఎమ్మెల్యేగా గెలవడంలో మోనుగ కీలక పాత్ర పోషించారు. కర్నూలు తో పాటు రాయలసీమ జిల్లాల్లో భూమా ఫ్యామిలీకి మంచి పేరు ఉంది అందులోనూ కార్యకర్తల్లో అనుచరులు మౌనిక రెడ్డికి మంచి ఆదరణ ఉంది మరోవైపు ఆమె పొలిటికల్ ఎంట్రీ కి మనోజ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే మౌనికకి ఇంట్రెస్ట్ ఉంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు చంద్రబాబు నాయుడు తో భేటీ నేపథ్యంలో త్వరలోనే ఆమె పొలిటికల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఓ కీలక నియోజకవర్గం టికెట్ ఆమెకు ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇక మంచు విష్ణు విరనికా రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. విరనికా రెడ్డి ఎవరో కాదు ఏపీ సీఎం వైఎస్ జగన్ కి సోదరి అవుతుంది. రాజారెడ్డి కుటుంబంలో ఈమె చిన్నమనవరాలు. రాజారెడ్డి నాలుగో కొడుకు సుధాకర్ రెడ్డి, విద్యా రెడ్డి దంపతుల కుమార్తె విరనికా. ఆమె అమెరికాలో పుట్టి పెరిగింది. చిన్నప్పటి నుంచి ఆమెకి డాక్టర్ అవ్వాలని ఉండేది. వీరికి ఆఫ్రికాలో చాలా వ్యాపారులున్నాయి. విరనికా రెడ్డి కుటుంబం నుంచి కూడా మంచు విష్ణు పై ఒత్తిడి ఉంది. పూర్తిస్థాయిలో వైసిపి పార్టీకి మద్దతు ఇవ్వాలని, క్రియాశీలకంగా వ్యవహరించాలని అప్పటి నుంచి కూడా మంచు విష్ణు కి ఒత్తిడి వస్తున్నట్లు తెలుస్తుంది. అయితే తండ్రి మోహన్ బాబు ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది విష్ణు మాత్రమేనని తేల్చి చెప్పేశారు. పిల్లల ఎదుగుదలకు తను ఎప్పుడు ఆటంకం కాబోనని స్పష్టం చేశారు. వారి జీవితాలను వారే చక్క దిద్దుకోవాలని పేర్కొన్నారు. పొలిటికల్ గా ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ముల మధ్య కూడా వార్ తప్పట్లేదని స్పష్టమవుతుంది. అయితే ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. నేరుగా రాజకీయాల కోసం మాట్లాడకుండా తప్పించుకుంటున్నారు. అన్నదమ్ములు ఇద్దరు ఎవరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారనేది మాత్రం ప్రజలకు స్పష్టంగా తెలుస్తుంది…