ఆంద్రప్రదేశ్ లో 23 సంఖ్య కు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. రాజకీయ అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి దీని గురించి తెలుసు.. ఏపీ ఎన్నికల్లో ఇప్పుడు వస్తున్న ఫలితాలు మళ్లీ23 ని గుర్తు చేస్తున్నట్లే కనిపిస్తుంది.. కూటమి అభ్యర్థులు దాదాపు అన్ని ప్రాంతాల్లో దూసుకుపోతుండగా వైసీపీ పూర్తిగా చతికిల పడే పరిస్థితి స్పష్టం గా తెలుస్తోంది.. 23 స్థానాలకు అటుఇటుగా ఆ పార్టీ మెజార్టీ చూపిస్తున్న తరుణంలో 23 సంఖ్య మరో సారి చర్చల్లోకి వచ్చింది.. 2014 ఎన్నికల్లో స్పష్టమైన అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ తదనంతర పరిస్థితుల్లో 23 మంది వైసీపీ శాశనసభ సభ్యులు తెదేపా లో చేరారు అందులో కొంతమంది మంత్రులు గా భాధ్యతలుకూడా స్వీకరించారు. పూర్తి బలం ఉండి కూడా వీళ్ళని చేర్చుకోవడం విమర్శలపాలయింది.. రాజకీయ మేధావులు, విశ్లేషకులు కూడా ఈ పరిస్థితి ని సమర్ధించలేదు.. అయితే 2019 లో జరిగిన ఎన్నికల్లో అప్పటి అధికార టీడీపీ కేవలం 23 స్థానాలకే పరిమితమై ప్రతిపక్ష పాత్ర లో నిలిచింది. ఈ 23 సభ్యుల్లో కూడా కొంత మంది అధికార వైసీపీ లో చేరిపోయారు.. దానిని కూడా విశ్లేషకులు ఎవరు పూర్తి గా సమర్ధించలేదు.. 2014 లో తన పార్టీ నుంచి టీడీపీ లో చేరిన వారిని రాజీనామా చేసి గెలిపించుకోమని వైసీపీ నుంచి సవాల్ ఎదురైంది అయితే టీడీపీ దానిని స్వీకరించలేదు. 2019 ఎన్నికల విజయం తరువాత జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ లోకి ఎవరు వచ్చిన రాజీనామా చేసి మాత్రమే రావాలని చెప్పిన ముఖ్యమంత్రి తరువాత ఆ మాట ను మడతెట్టేసారు.. ఇప్పుడు మళ్లీ వైసీపీ దాదాపు అదే 23 స్థానాలకు పరిమితమయ్యే అవకాశం ఖాయమైంది.. ఎప్పుడు గెలవని చోట్ల కూడా టీడీపీ ఇప్పుడు గెలవడం విశ్లేషకులను కూడా ఆశ్చర్యపరిచింది..వార్త రాసే సమయానికి వైసీపీ లీడ్ మరింత తగ్గుతూ వస్తోంది.. అయితే గౌరవప్రదంగా 23 అయిన గెలుస్తుందా ఇంకా తక్కువ స్థానాలతో సరిపెట్టుకుంటుందా చూడాలి
previous post
next post