Vaisaakhi – Pakka Infotainment

ఆ విగ్రహమంటే దొంగలకు హడల్…

రెండు కోట్ల రూపాయల విలువ చేసే ఓ పంచలోహ అమ్మవారి విగ్రహాన్ని చోరీ చేసిన దొంగలు దానిని తీసుకుని వెళ్లలేక వదిలివెళ్లిపోయారు… ఒక్కసారి అయితే సరే… ఇదే సంఘటన మరో మూడు సార్లు ఇలాగే జరిగింది. మొత్తం నాలుగుసార్లు, దొంగలు ఈ ఆలయ విగ్రహాన్ని దొంగిలించారు, కానీ వారు దాన్నీ ఎక్కువ దూరం వెళ్ళలేక వెంటనే వెనక్కి తెచ్చి యథాస్థానం లో ఉంచేశారు. ఆలాంటి విశిష్ట విగ్రహం.. విభిన్న ఆలయం దక్షిణ కేరళ లోని కన్నూర్ జిల్లా, ముజక్కున్ను దగ్గర ఉంది.. ఆ ఆలయమే “మృదంగ శైలేశ్వరి ఆలయం” పరశురామ ప్రతిష్ఠిత 108 దేవాలయాలలో ఇది ఒకటి. మిజావిల్ భగవతి ఈ ఆలయంలో చండీ మరియు చాముండ గా దర్శనం ఇస్తుంది. ప్రధానమైన జ్ఞాన శక్తితో, కళలలో నైపుణ్యం (సిద్ధి) దీవెనలు ఇస్తూ, వెలుపల చాముండగా పోర్కలిగా పిలుస్తారు. అలాగే కేరళ శాస్త్రీయ నృత్యం “కథాకళి” ఇక్కడే ఉద్భవించినట్లు చెపుతుంటారు. ఈ ఆలయం జ్ఞానానికి సంబంధించిన ఒక తాంత్రిక శక్తి పీఠంగా భావిస్తారు. “మిఝావిల్ భగవతి” అని అమ్మవారిని భావించే ఈ ఆలయానికి “మృదంగ శైలేశ్వరి” అన్న పేరు రావడం వెనుక ఒక కథ ప్రచారం ఉంది. ఈ ప్రదేశంలో మృదంగ ఆకారంలో ఉన్న ఒక శిల స్వర్గం నుండి పడిపోయిందని ఈ శిలలో అమ్మావారి ఉనికిని గ్రహించిన పరశురాముడు మాతని విగ్రహంలోకి ఆహ్వానించి ఆలయాన్ని నిర్మించాడన్నది స్థలపురాణం. ఈ ఆలయంలో కొద్ది దశాబ్దాలుగా జరుగుతున్న అద్భుతం ఏమిటంటే, వరుస దొంగతనాలు.. తిరిగి అమ్మవారు యధాస్థానానికి చేరుకోవడం.. ఇటీవల కేరళ రిటైర్డ్ డిజిపి అలెగ్జాండర్ జాకబ్ భగవతి విగ్రహాన్ని దొంగిలించిన ఆ దొంగల విషయాన్ని ఓ మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించడం తో ఈ కధ మళ్ళీ వార్తల్లోకి వచ్చింది.. సుమారు రెండుకోట్ల మార్కెట్ విలువ కలిగివున్న పంచలోహ విగ్రహం’ ఉన్న ఆలయానికి ప్రభుత్వం సెక్యూరిటీ గార్డులును ఇవ్వలేదట. ఎందుకంటే ఆ విగ్రహాన్ని దొంగిలించడం అసాధ్యమని వారు నమ్మడమే జాకబ్ డి జి పి ఉన్న సమయంలో భద్రత కు ఆయన సిఫారసు చేసినప్పటికీ కూడా సెక్యూరిటీ ఇవ్వలేదట అప్పటి ప్రభుత్వం. మొదటిసారిగా దొంగలు ఈ విగ్రహం దొంగతనం చేసిన తరువాత దానిని పారక్కడవు వద్ద రోడ్డుపక్కన విగ్రహాన్ని వదిలేసి ఇది మృదంగ శైలేశ్వరీ ఆలయలోని విగ్రహం దాన్ని ఇంతకు మించి ముందుకు తీసుకెళ్లలేకపోతున్నాం అని ఒక లేఖ పెట్టి వెళ్లిపోయారట.. మూడు సంవత్సరాల తర్వాత రెండో సారి మళ్లీ జరిగిన దొంగతనం లో విగ్రహాన్ని కేవలం మూడువందల మీటర్ల మాత్రమే తీసుకెళ్లగలిగారట. మూడవసారి జరిగిన దొంగతనం లో విగ్రహాన్ని కాల్పేట వరకు తీసుకెళ్లారు. కానీ విగ్రహానికి సంబంధించిన వివరాలను సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు తెలియచేసి ఆ విగ్రహాన్ని అక్కడే వదిలిపెట్టి దొంగలు పరారయ్యారట. ఈ మూడు సందర్భాల్లో తనే డ్యూటీలో ఉన్నట్లు ఆయన తెలిపారు.. ఇదొక అద్భుత సంఘటన అని ఆయన వివరించారు. చాలా సంవత్సరాల తరువాత దొంగలు పట్టుబడినప్పుడు, వారు దొంగిలించబడిన విగ్రహంతో తప్పించుకోలేకపోవడానికి గల ఖచ్చితమైన కారణాన్ని అడిగితే వారు విగ్రహాన్ని తీసి తమ వెంట తీసుకెళ్తున్నప్పుడు, వారు తమ వెళ్లాల్సిన దిశను పూర్తిగా మర్చిపోతున్నామని, నిద్రాణ స్థితిలోకి వెళ్ళిపోతున్నట్టు ఉంటుందని అన్నిటి కంటే భయంకరమైన విషయం ఏమిటంటే, వారు తమ ప్రేగు కదలికలపై నియంత్రణను కోల్పోయి మల,మూత్ర విసర్జన మనకు తెలియకుండానే జరిగిపోతుందని దొంగలు చెప్పినట్టు వివరించారు. తాంత్రిక విధి విధానాల’ యొక్క ఫలితమే ఇలా జరుగుతుందని విగ్రహ ‘ప్రతిష్ట కర్మ’ తొమ్మిది కంటే ఎక్కువ రోజుల సుదీర్ఘమైన ప్రక్రియ వలన దొంగలకు ఇటువంటి అనుభవం కలిగిందని ఆలయ అర్చకులు చెప్తున్నారు. అయితే ఈ మూడు విఫలయత్నాల అనంతరం మైనారిటీ వర్గానికి చెందిన అనుభవజ్ఞులైన దొంగల ముఠా ఈ అమ్మవారి విగ్రహాన్ని ఎలాగైనా దొంగిలించాలని ప్రయత్నించారు. విగ్రహం మహిమను గాని అందులో ఉన్న అతీంద్రియ శక్తులనుగాని వారు అస్సలు విశ్వసించలేదు. కానీ వారు కూడా చోరీ చేసిన విగ్రహాన్ని మళ్లీ వదిలిపెట్టారు. తరువాత వారు పట్టుబడినప్పుడు కూడా విగ్రహాన్ని వదిలివెళ్లాడాని మిగిలిన దొంగలు చెప్పిన కారణాలే చెప్పారట.. కళలకు, ముఖ్యంగా సంగీతానికి పురాణాల ప్రకారం అదిదేవత అయిన ఈ అమ్మవారి మహిమలు అనంతం. అద్వితీయం..

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More