కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన హోంబళే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ నిర్మాత గా సుమన్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన రఘుతాత ఓటీటీలోకి రాబోతోంది. సెప్టెంబర్ 13 నుంచి ఈ చిత్రం జీ5లో స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో అందుబాటులో ఉండనుంది.
కీర్తి సురేశ్ మాట్లాడుతూ.. ‘నమ్మిన దాని కోసం నిలబడే ఓ ధైర్యశాలి పాత్రను రఘు తాత చిత్రంలో పోషించడం ఆనందంగా ఉంది. ఆ పాత్రకు జీవం పోయడం ఓ సవాలుగా అనిపించింది. ZEE5లో ఈ ఆకర్షణీయమైన కథనం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు చేరువ అవుతుండటం సంతోషంగా ఉంది’ అని అన్నారు.
హోంబలే ఫిలింస్ అధినేత విజయ్ కిరగందూర్ మాట్లాడుతూ.. ‘‘రఘుతాత’ ప్రపంచ డిజిటల్ ప్రీమియర్ కోసం ZEE5తో భాగస్వామి అయినందుకు మాకు సంతోషంగా ఉంది. విజువల్ ట్రీట్, ఎమోషనల్ జర్నీగా సాగే రఘు తాత చిత్రం ఈ ZEE5 ద్వారా అందరి వద్దకు చేరుతోంది. ‘రఘుతాత’ అనేది మాకు ఒక ప్రత్యేక ప్రాజెక్ట్. ఇది సున్నితత్వం, హాస్యంతో ఉండటమే కాదు సామాజిక సమస్యలను తెలియజేస్తుంది’ అని అన్నారు.
దర్శకుడు సుమన్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘రఘుతాత’ సినిమా మా జీవితంలో ఓ మరుపురాని ప్రయాణంగా నిలుస్తుంది. ఈ చిత్రం భాషా, ప్రాంతం అన్న తేడా లేకుండా అందరినీ అలరించగలిగింది. ఇక ZEE5లో ప్రపంచ డిజిటల్ ప్రీమియర్ కోసం ఎదురు చూస్తున్నాను’ అని అన్నారు.
.