ఏపీలో మళ్లీజగనే సీఎం అవుతాడనేదిబిఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ఇచ్చిన స్టేట్మెంట్. అయితే గతంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు నేడు లేవన్నది వాస్తవం.ప్రజానాడి పట్టుకోవడంలో ప్రతి ఒక్కరూ విఫలమయ్యారు.కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు ఎవరు విజేత అనేది తెలియని పరిస్థితి.కానీ కెసిఆర్ మాత్రం ముందస్తుగానే తన స్నేహితుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతాడని కరాకండిగా చెప్పేశారు.ఇది తన మాట కాదని అక్కడ ప్రజల మాటని పేర్కొన్నారు.గత తెలంగాణ ఎన్నికలలో కూడా తమ పార్టీ అధికారంలోకి వస్తుందని తానే సీఎం అవుతారని కెసిఆర్ ప్రకటించారు.కౌటింగ్ తర్వాత పరిస్థితులు తారు మారయ్యాయి. ఊహించని విధంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు.అటు కెసిఆర్ ప్రకటన ఏమో కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా అదే స్లోగన్ చెబుతున్నారు.అన్ని సీట్లను తమ పార్టీ గెలుచుకుంటుందని తిరిగి తాము అధికారంలోకి వస్తామని రెండోసారి ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేస్తానని జగన్ చెబుతున్నారు.ప్రతి ఒక్కరికి నచ్చినట్లు మాట్లాడే స్వేచ్ఛ ఉంది ఒక పరిమిత వరకు జగన్ కానీ లేదా కేసీఆర్ కానీ మాట్లాడి ఉంటారు.వాస్తవంగా ఆంధ్రాలో పరిస్థితులు పూర్తిగా మారాయి. ప్రజలు ఎవరికీ ఓటు వేసిందనేది బయటకు స్పష్టంగా చెప్పడం లేదు.ఎవరు అడిగినా మీ పార్టీకి ఓటు వేసామని చెప్పి తప్పించుకుంటున్నారు. కానీ ఆంధ్రాలో మాత్రం గెలుపుపై జగన్మోహన్రెడ్డి ధీమా వ్యక్తం చేస్తుండగా మరోపక్క కేసీఆర్ కూడా జగన్ గెలుపు పై ధీమాను వ్యక్తం చేయడం అద్భుతమైన స్నేహాధర్మం..