మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.. అయితే ఆ పార్టీ లో చేరేందుకు పెద్ద అభ్యంతరాలు వ్యక్తం కానప్పటికీ పార్టీ లో పెద్దాయన పెట్టిన డిమాండ్ మాత్రం ఇప్పుడు చర్చానీయాంశం అయింది.. టీడీపీలో చేరే ముందు పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు తనపై చేసిన విమర్శలకు క్షమాపణలు చెప్పాలని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కొత్త డిమాండ్ ను కన్నా ముందుంచారు. గతంలో వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా వీరిద్దరి మధ్య సఖ్యత అయితే లేదు. గతం లో రాయపాటి సాంబశివరావు చేసిన విమర్శలపై కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో కన్నా లక్ష్మీనారాయణ పరువు నష్టం దావా దాఖలు చేసారు.. ఇటీవలనే ఈ కేసులో వీరిద్దరూ రాజీకి వచ్చిన నేపథ్యంలో మళ్ళీ ఈ కొత్త మెలిక పార్టీ వర్గాల్లో డిస్కషన్ కు తావిచ్చింది.. బీజేపీకి రాజీనామా చేసిన కన్నా లక్ష్మీనారాయణ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వైఖరి కారణం గానే పార్టీకి గుడ్ బై చెబుతున్నట్టుగా ప్రకటించి తీవ్ర ఆరోపణలు చేశారు.. బీజేపీకి రాజీనామా చేయడానికి ముందే కొందరు టీడీపీ నాయకులతో కన్నా చర్చలు జరిపినట్టుగా ప్రచారం సాగినప్పటికి తన నివాసంలో అనుచరుల సూచన మేరకే బీజేపీకి రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు చెపుతున్నారు. గత కొంత కాలంగా కన్నా లక్ష్మీనారాయణ సోము వీర్రాజుపై మీడియా వేదికగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కాకపోవడానికి సోము వీర్రాజు అండ్ టీమ్ వైఖరే కారణమని ఆ నలుగురు వారి వర్గాల కారణంగానే జనసేన లో కూడా అసంతృప్తితో ఉందని అంటున్న కన్నా లక్ష్మీనారాయణ. మాజీ మంత్రి కన్నా భవిష్యత్తు ప్రయాణం గురించి అనుచరులకు స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ సమావేశం తర్వాత టీడీపీలో చేరే విషయమై కన్నా లక్ష్మీనారాయణ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని ఆయన వర్గీయులు చెబుతున్నారు.
previous post
next post