ముచ్చటగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రధాని మోదీ తొలిసారిగా ఈనెల 18న వారణాసిలో పర్యటించనున్నారు.ప్రధాని ఇదే నియోజకవర్గం నుంచి మూడోసారి ఎన్నికవడం విశేషం. ఈ పర్యటనలో భాగంగా రైతు సదస్సులో పాల్గొని.. రైతులకు ప్రయోజనం చేకూర్చే సమ్మాన్ నిధిని విడుదల చేయనున్నారు. వారణాసిలోని రోహనియా, సేవాపురి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సదస్సు వేదిక ఉండనున్నట్లు యూపీ బీజేపీ నేతలు తెలిపారు. ఈ సందర్భంగా తనను గెలిపించిన వారణాసి ప్రజలకు మోదీ కృతజ్ఞతలు తెలపనున్నారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల నడుమ మోడీ పర్యటన కొనసాగనుంది నాలుగు వందల సీట్ల లక్ష్యం తో బరిలోకి దిగిన ఎన్డీఏ ముఖ్యంగా బీజేపీ కి ఈ ఎన్నికలు గట్టిపాఠాన్నే చెప్పాయి వారణాసి సైతం మోదీ ని కలవరపెట్టింది.. ఒక రౌండ్ లో వెనకబడేటట్లు కూడా చేసింది.గత ఎన్నికల కన్నా 9.38శాతం ఓట్లు తగ్గడం కాంగ్రెస్ అభ్యర్ధి అనూహ్యంగా పుంజుకోవడం తో బీజేపీ ఒక దశ లో కలవరపడింది. రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంక గాంధీ ఇక్కడ నుంచి పోటీ కి దిగితే మోదీ ఓడిపోయేవారు అని చేసిన కమెంట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.. ఇదిలా ఉండగా రాహుల్ గాంధీ పోటీ చేసిన రాయిబరేలి, వాయినాడ్ రెండు నియోజకవర్గాల్లో కూడా ఘన విజయం సాధించడం తో ఇప్పుడు ఒక నియోజకవర్గాన్ని వదులు కోవాల్సిన పరిస్థితి వచ్చింది.. అయితే తనను భారీ మెజారిటీతో గెలిపించిన వాయినాడ్ ప్రజలకు అక్కడ పర్యటిస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్న రాహుల్ గాంధీకి ప్రజలనుండి అపూర్వ ఆదరణ లభిస్తుంది.. అయితే ఏ సీట్ వదులు కుంటారన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.. 2019 ఎన్నికల్లో ప్రాతినిధ్యం వహించిన వాయినాడ్ ను ఈసారి వదులుకుని రాయిబరేలి స్థానం ఉంచుకోవాలని రాహుల్ భావిస్తున్నట్లు సమాచారం.. ఓవైపు థాంక్స్ చెప్పుకోడానికి వాయినాడ్ లో రాహుల్ పర్యటిస్తుంటే పధకాల ప్రారంభానికి ప్రధాని వారణాసి లో పర్యటించనున్నారు..
previous post
next post