Vaisaakhi – Pakka Infotainment

టీటీడీ తోనే ప్రక్షాళన ప్రారంభిస్తా-చంద్రబాబు నాయుడు

గత ఐదేళ్లలో ఏపీ అన్ని రంగాల్లో నష్టపోయిందని టీటీడీతోనే రాష్ట్రంలో ప్రక్షాళన మొదలుపెడతానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు శ్రీవారి ని దర్శించుకున్న అనంతరం మీడియా తో మాట్లాడారు.. తిరుమలలో గోవిందా నామ నినాదాలు తప్ప మరేమి వినపడకుండా చేస్తానని అన్నారు. వెంకటేశ్వరస్వామి మా ఇంటి కుల దైవం సీఎం అయిన తర్వాత స్వామిని దర్శించుకున్నా దేశరాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం దక్కిందని వెంకటేశ్వరస్వామి తెలుగు జాతికి సేవ చేయాలని స్వామివారు ప్రాణభిక్ష పెట్టార రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించానని చెప్పారు. ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని ప్రధాని మోదీ, అమిత్ షా సహా ప్రముఖులంతా ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు రాష్ట్ర చరిత్రలో 93 శాతం స్ట్రెకింగ్ రేటు విజయం ఎప్పుడూ రాలేదని ఎన్నో విజయాలు చూశాం..

ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు ప్రపంచంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉండాలనేది నా తపన ప్రస్తుతం దేశరాజకీయాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం దక్కింది సంపద సృష్టించాలి.. అది పేదవాడికి అందాలి ఆర్థిక అసమానతలు లేకుండా చూడాలి ఆర్థిక అసమానతలను తొలగించడమే మా ధ్యేయం 1995లో సీబీఎన్ పాలన ప్రారంభమైంది అంతకుముందు పరిపాలన సచివాలయం నుంచే సాగింది నేను అధికరంలోకి వచ్చాక ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చా మా పాలన చూసి ప్రపంచ నేతలు హైదరాబాద్‍కు రావడం మొదలుపెట్టారు మంచి పాలన అందిస్తే ప్రపంచం మనవైపు చూస్తుందనేందుకు అదే ఉదాహరణ భారతదేశంలో అతిపెద్ద వ్యవస్థ కుటుంబ వ్యవస్థ కుటుంబం శక్తి, రక్షణ, ఆనందాన్నిస్తుంది – కష్టాలు పంచుకునే భాగస్వాములు కుటుంబంలోనే ఉంటారు ప్రజాపాలన వచ్చింది.. ప్రజలకు రుణపడి ఉంటా రాగద్వేషాలు లేకుండా పరిపాలన చేస్తా ఏపీని అభివృద్ధిలో నెం.1 చేస్తా అమరావతి విధ్వంసమైంది.. పోలవరాన్ని నీళ్లలో ముంచేశారు అమరావతి, పోలవరాన్ని చక్కదిద్ది.. పూర్తి చేస్తా నేను అందరివాడిని.. ఏపీని పేదరికం లేని రాష్ట్రంగా మారుస్తా నని చంద్రబాబు నాయుడు చెప్పారు

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More