రాష్ట్రంలో కొత్త మంత్రి వర్గం కొలువుతీరింది.. ఎగ్జిట్ పోల్ ఫలితాల లాగే మంత్రి వర్గ కూర్పు పై కూడా ఎన్నో విశ్లేషణలు.. మరెన్నో ఈక్వేషన్లు వెలువడ్డాయి. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ మంత్రులు గా గవర్నర్ కి పంపిన జాబితా ఉండేసరికి ఆశావహులు ముఖ్యంగా సీనియర్లు కంగు తిన్నారు.. కుల, ప్రాంత ప్రాతిపదికలతో పాటు కూటమి భాగస్వామ్య పక్షాల సర్దుబాటు తో పాటు ప్రతి ఏడుగురు శాసనసభ్యులకు ఒక మంత్రి పదవి చొప్పున కేటాయింపు జరిగింది.. 21 మంది శాసనసభ్యులు ఉన్న జనసేనకు మూడు మంత్రి పదవులు(పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్) దక్కగా మరో కీలక భాగస్వామ్య పార్టీ బీజేపీ 8స్థానాలు గెలిస్తే ఒక మంత్రి (సత్యకుమార్)ప్రమాణం చేశారు.తెలుగుదేశం పార్టీమంత్రుల జాబితాలో అచ్చెన్నాయుడు , నారా లోకేష్, కొల్లు రవీంద్ర, నారాయణ, వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు.. ఎన్.ఎమ్.డి.ఫరూక్, ఆనం రామనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారధి, డోలా బాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవి, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్థన్ రెడ్డి, టీజీ భరత్, ఎస్.సవిత, వాసంశెట్టి సుభాష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి. లు వున్నారు. సిఎం చంద్రబాబు తో పాటు నారా లోకేష్ కాకా మరో 6గురు మాత్రమే గతంలో మంత్రులుగా పనిచేసిన వారు ఉండగా 17 మంది కొత్తవారికి అవకాశం కల్పించారు.తమకు మంత్రి పదవి ఖాయం అనుకున్నవారికి కూడా కూటమి అధిష్టానం షాక్ ఇచ్చింది. ఉమ్మడి విశాఖ జిల్లా నర్సీపట్నం నుంచి చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు,బండారు సత్యనారాయణమూర్తి గతం లో మంత్రులుగా పని చేశారు. కొణతాల రామకృష్ణ ఒక పర్యాయం రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. నాలుగు సార్లు ఎన్నికైన వెలగపూడి రామకృష్ణ బాబు, గణబాబు 95 వేలు అత్యధిక మెజారిటీ తో విజయం సాధించిన గాజువాక శాసన సభ్యులు పల్లా శ్రీనివాసరావువంటి వారికి మంత్రివర్గంలో స్థానం లభించకపోవడం చర్చనీయాంశంగా మారింది. మొదటి నుంచి మంత్రి వర్గం లో యువరక్తం ఉండాలని నారా లోకేష్ అభిమాతానికి అనుగుణంగా నే ఈ కూర్పు ఉందని భావిస్తున్నారు.. అయితే సీనియర్లను పూర్తిగా విస్మరించడం మంచిదేనా….? అనే చర్చ సాగుతోంది. కొత్త మంత్రివర్గంలో కొంతమందిఎనిమిది మంది సీనియర్లకు స్థానం లభించింది. చంద్రబాబు నాయుడు ని మినహాయిస్తే, ఆనం రామనారాయణరెడ్డి, కింజరాపు అచ్చెన్నాయుడు,కొలుసు పార్థసారథి వంటి సీనియర్లు కూడా మంత్రివర్గంలో స్థానం పొందగలిగారు. విస్తరణ లో మరికొందరు రెండున్నర ఏళ్ల తరువాత ఇంకొందరికి పదవుల చాన్స్ వుండే అవకాశం వుంది.. అంత వరకు వాళ్లంతా మౌనం గా ఉండాల్సిందే…
previous post